Wednesday, March 11, 2026

నా ధైర్యం మీరు… మీ కోసం కొట్లాడుతా: బోగ శ్రావణి

- Advertisement -

నిరుద్యోగ యువకుల జీవితాలలో ప్రభుత్వం చెలగాటం
బిజెపికి ఓటేసి గెలిపిస్తే తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేస్తం
వాస్తవాలను వివరించేందుకే బీజేపీ గడప గడపకు ప్రచారం
బీజేపీ జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణి

జగిత్యాల:  నా ధైర్యం మీరు.. నన్ను ఆదరించి, అవకాశం కల్పిస్తే మీకోసం, మన హక్కుల కోసం నియోజకవర్గం అభివృద్ధి కొట్టాడుతానని బిజెపి నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణి -ప్రవీణ్ అన్నారు.మంగళవారం రాయికల్ మండలంలోని అయ్యోధ్య, ఉప్పుమడుగు, కుమ్మరిపల్లి రాజ్ నగర్,  గ్రామాల్లో  గడప గడప కి బిజెపి కార్యక్రమం లో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రావణి మాట్లాడుతూ…. ఓట్ల పండగ వచ్చింది కాబట్టి అన్నీ పార్టీల నాయకులు వస్తారని, ప్రజల కోసం పనిచేసే పార్టీని ఆదరించాలని కోరారు. తెలంగాణ పల్లెల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు వస్తున్నాయని వాటి వివరాలు మీరంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను గెలిపిస్తే  మహిళలు బస్ లో ఫ్రీ గా వెళ్లొచ్చు అని చెప్తున్నారని, కానీ అయ్యోధ్య గ్రామానికి బస్ లేనప్పుడు ఉచిత ప్రయాణం ఎట్లా చేస్తారని గ్రామస్తులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కేవలం రైతు బంధు ఇచ్చి,  తరుగు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వచ్చి, రిబ్బన్ కటింగ్ చేసి వెళ్లడం తప్ప, ఎనడైనా రైతుల గురించి మాట్లాడారా ? అటు తొంగి చూశారా ? అలాంటప్పుడు కారు గుర్తు కు ఓటయమని ఏలా అడుగుతారో ప్రజలే ఆలోచించాలన్నారు.
బిజెపి ఎంపీ అర్వింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తెచ్చారని, ప్రస్తుతం ముత్యం పేట్ చెక్కర ఫ్యాక్టరిని తెరిపించేందుకు సైతం మళ్ళీ బండ్ పేపర్ రాసిచ్చారని గుర్తు చేశారు. తనను గెలిపిస్తే తరుగు లేకుండా వడ్ల కొనుగోళ్లు జరిగేలా చర్యలు చేపట్టే బాధ్యత నాదని శ్రావణి హామీ ఇచ్చారు. రైతులు బిజెపిని ఆదరించాలన్నారు. ఇతర పార్టీలకు ఓటేస్తే పెన్షన్ పోతుందని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను భయభ్రంతులకు గురి చేస్తున్నారని ఆరోపించిన శ్రావణి గారు, ఎంపీ గా ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఒడితే పెన్షన్ లు బంద్ అయ్యాయా అని ప్రశ్నించారు.

బిజెపి అధికారం లోకి వస్తే పథకాలు కొనసాగించడం తో పాటు,  రెట్టింపు అవుతాయని గమనించాలని కోరారు. అయ్యోధ్య గ్రామంలో కనీసం మౌలిక వసతులు కల్పించడం లేదని గ్రామ ప్రజలు గోస పడుతున్నారని, రాష్ట్రం ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడంతో కేంద్రం నిధులతో గ్రామ పంచాయితీల్లో పాలనా సాగుతుందని గమనించాలని కోరారు. పొదుపు సంఘాల్లో ముద్ర, వీధి వ్యాపారులకు లోన్ లు మోదీ సర్కార్ ఇస్తుందని, మరి దళిత, బిసి, మైనారిటీ బంద్ లు అయ్యోధ్య గ్రామంలో ఎంత మందికి వచ్చాయో ఆలోచించాలన్నారు. కేంద్రం నిధులు ఇస్తుందని బీఅర్ఎస్ నాయకులు ఎక్కడ చెప్పడం లేదని, ప్రజలు బిజెపి ని మెచ్చుకుంటారనే అక్కసుతో మోదీ పేరు గాని, కేంద్రం ప్రభుత్వం గురించి గానీ చెప్పడం లేదన్నారు. ఈ గ్రామానికి  జనవరి నుంచి ఇప్పటి వరకు 18లక్షలు 2వేలు ఇస్తే .రాష్ట్ర ప్రభుత్వం కేవలం
1.90 వేలు ఇచ్చిందని గుర్తు చేశారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు ఆ లక్ష ఎక్కడ ఖర్చు పెట్టారో మీరే ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ మధ్యలో ఉన్నోళ్ల జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బిజెపి ప్రతినిధులుగా మేము మీ దగ్గరికి రావడం జరిగిందని ఆడబిడ్డ కు ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం ఇచ్చిన బిజెపి పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి, బూతు అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ధర్మరాజు, ఉపసర్పంచ్ ఏనుగు రవీందర్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సుజాత, మండల ఉపాధ్యక్షులు పసుపునురి శ్రీనివాస్, కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు కోరే రాజ్ కుమార్, బూత్ అధ్యక్షులు కంచర్ల అంజన్న, గ్రామ శాఖ అధ్యక్షులు భారతపు రాజు, వార్డు మెంబర్ తిరుపతి, సిరిపురం గంగాధర్, మిట్టపల్లి మహేష్ పసుపునూరి రాజేష్, జైనారపు భీమన్న, తాటిపల్లి రాజేశ్వర్ రెడ్డి, జలపతి, గుగులోతు రవి, జవహర్ లాల్, శీను నాయక్, రమేష్ నాయక్, మరియు రైడర్స్ యూత్ సభ్యులు, కుమ్మరిపేట గ్రామ శాఖ సభ్యులు,  బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్