Friday, February 7, 2025

ఈ నెల 8 – 12 వ తేదీ వరకు నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహణ

- Advertisement -

ఈ నెల 8 – 12 వ తేదీ వరకు నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహణ

Nalgonda Lakshmi Narasimha Swamy Brahmotsavam will be held grandly from 8th to 12th of this month.

జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి

ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలి

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల,
ఈ నెల 8 నుండి 12 వ తేదీ వరకు వరకు నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు.
బుధవారం జిల్లా లోని కోడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) లో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల(జాతర) జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి దేవాలయం తరపున చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలని సూచించారు. సుమారుగా 10 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు. గుట్టపైన తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాలని, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎం.పి.డి.ఓ. ను ఆదేశించారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆర్. టి. సి. బస్సులను కచ్చితంగా ట్రిప్స్ వేయాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాల (జాతర) ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయుటకు షిఫ్ట్ ల వారీగా అధికారులు, సిబ్బంది సమన్వయం  చేసుకోవాలని ఈ సందర్భంగా  కలెక్టర్  సూచించారు. పార్కింగ్ స్థలంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కొండ చివరి ప్రాంతం అయినందున భక్తులు ప్రమాదకరమైన ప్రదేశాలలో ఫోటోలు తీసుకునే సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రమాద సూచికల బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలని తెలిపారు.
అనంతరం ఆలయ అర్చకులు అర్చన చేసి కలెక్టర్ ను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఇంచార్జీ డి.పి.వో.మదన్ మోహన్, నల్లగొండ గుట్ట ఆలయ ఈ.ఓ.వెంకన్న, ఎమ్మార్వో, ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్