నర్సాపురం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బి.ఆర్.కె.నాయుడు
నరసాపురం లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గా కోనసీమ ముద్దుబిడ్డ కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు ను సోనియాగాంధీ ఎంపిక చేశారు. ఎ.ఐ.సి.సి లో గత మూడన్నర దశొబ్ధాలుగా వివిధ హోదాల్లో ఆయన పని చేసారు. అమలాపురం పట్టణానికి చెందిన బిఆర్ కె నాయుడు వృక్ష శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఎం.ఫిల్ చేసారు. ఎఐసిసి ఎకనామిక్ అడ్వైజరీ విభాగం కో ఆర్డినేటర్ గా పని చేసారు. కేంద్ర పెట్రోలియం, ఓఎన్జీసీ శాఖామంత్రి బ్రహ్మదత్ ను అమలాపురం తీసుకుని వచ్చి కోనసీమ లో ఓ.ఎన్.జి.సి. కార్యక్రమాలను విస్తృతం చేసారు. ఇండియన్ టుబాకో డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ గానూ, ఇండియన్ ఫార్మ్స్ చైర్మన్ గానూ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గానూ పని చేసారు
రెండు రాష్ట్రాలకు పి.సి.సి. ఎన్నికల అధికారి గా పని చేసారు. అప్పటి ఎంపీ.కుసుమ కృష్ణ మూర్తితో నాటి ఎఐసిసి అధ్యక్షులు రాజీవ్ గాంధీ ను కోనసీమ తీసుకుని వచ్చి రెండు రోజులు పాటు పర్యటింప చేసారు.
గత మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పని చేసారు. దేశ రాజకీయాల్లో మంచి అవగాహన ఉన్న నాయుడు తొలి సారిగా లోక్ సభ ఎన్నికల్లో కాపులు అధికశాతం ఉన్న నరసాపురం లోక్ సభ నుంచి పోటీ చేయడంతో నరసాపురం లో పోటీ మంచి రసవత్తరంగా మారనుంది.