- Advertisement -
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
New Year celebrations should be conducted peacefully
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం
నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రశాంతయుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతయుతంగా నిర్వహించుకొనేందుకు ప్రజలకు జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు చేసారు.
మంగళవారం రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడవరాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాలను అతివేగంగా నడిపినా, బైక్ రేసులు నిర్వహించినా, ట్రిపుల్ రైడింగు చేసినా వారిపై కేసులు నమోదుచేస్తామన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆయా వాహనాలను సీజ్ చేస్తామన్నారు. డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకల పేరుతో అర్ధ రాత్రి ఒంటి గంట తరువాత ప్రజలెవ్వరూ రహదారులపై తిరగరాదన్నారు. మైనర్లుకు వారి తల్లిదండ్రులు వాహనాను ఇవ్వవద్దరాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రైవ్ చేపడతామని,ఎవరైనా మైనరు డ్రైవింగు చేసి పట్టుబడితే, వారిపైనా, వారికి వాహనాలిచ్చిన తల్లిదండ్రులు లేదా ఆయావాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ముఖ్య కూడళ్ళలో పోలీసుదోబస్తు, పికెట్లును ఏర్పాటు చేసామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం, నృత్యాలు చేయడం, బహిరంగ పార్టీలు నిర్వహించడం, డిజే/లౌడుస్పీకర్లుతో పెద్ద శబ్ధం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
- Advertisement -