Sunday, January 12, 2025

ఎవరు ఏం చేసినా కేసీఆర్ గెలవడు

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 25, (వాయిస్ టుడే):  మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఆయన నివాసంలో రూ.300 కోట్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తాము ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా సీఈఓ స్పందించలేదన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ నుంచి సీఈఓ వికాస్ రాజ్‌కి వంద సార్లు కాల్ చేసినా ఎత్తలేదని .. గోయల్ ఇంట్లో ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రైతు బంధు నిధుల జమకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ బంధం మరోసారి బయటపడిందని   రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోడీది ఫెవికాల్ బంధం బలపడిందని రైతుబంధు విషయంలో బీఆర్ఎస్ కు సహకరించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చేలా బీజేపీనే చేసిందని ఆరోపించారు.  కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని పోలింగ్ కు 4 రోజుల ముందు రైతుబంధు డబ్బులు వేస్తున్నారని, ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని బీఆర్ఎస్ చూస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జనవరిలో రైతుబంధు వేస్తామని ఇప్పుడే రైతుబంధు వేయడం ద్వారా కౌలు రైతులు నష్టపోతారన్నారు. బీఆర్ఎస్ వేస్తున్న రైతుబంధు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని విజ్ఞప్తి చేశారు.  ప్రధాని మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కో కేసీఆర్ భావిస్తున్నారన్నారు. పదేళ్ల పాటు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ పంచుకొని ఆస్తులు పంచుకున్నారన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్‌ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని రేవంత్ విమర్శిస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌కి పడే ఓట్లను చీల్చడానికి బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.కేసీఆర్ పై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారని.. అయితే వారంతా బీజేపీలో ఉంటే మంచివారు లేదంటే రావణాసురులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  కేసీఆర్ ప్రజాదర్బార్ పెడతాడో, జనతా బార్ పెడతాడో వాళ్ళకే తెలియాలన్నారు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని రేవంత్ పేర్కొన్నారు.  కేసీఆర్ ఓటుకు పదివేలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధుకు అనుమతి తెచ్చుకున్న వాళ్ళు దళితబందు, బీసీ బందు, మైనారిటీ బందుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు? ఎన్నికల్లో మా పోటీ ఈడీ, ఐటీ తోనే ఉంది. కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు, గోయల్ ఇంటిపై దాడి, రైతుబంధు విషయంలో మోదీ, కేసీఆర్ స్నేహం స్పష్టంగా అర్థం అవుతోందని రేవంత్ విమర్శించారు.  వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు లేవు. బీజేపీలో ఉన్నప్పుడు రాముడిగా కనిపించిన వివేక్.. కాంగ్రెస్‌లోకి రాగానే రావణసూరుడిగా మారాడు. కేసీఆర్‌ని గద్దె దించేందుకు కంకణం కట్టుకున్నాడు కాబట్టే పొంగులేటిపై దాడులతో హింసిస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్