1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

- Advertisement -
Notification for filling 1520 posts..
Notification for filling 1520 posts..

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో…

హైదరాబాద్‌: తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ (job notification in telangana) విడుదలైంది. కమిషనర్‌ ఆఫ్ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 1,520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకానికి బుధవారం సాయంత్రం నోటిఫికేషన్‌ వెలువడింది..

ఈ పోస్టులకు ఆగస్టు 25 ఉదయం 10.30గంటల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 19 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

కౌన్సిల్‌ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (మహిళ) ట్రైనింగ్‌ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్‌ ఒకేషనల్‌ మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) ట్రైనింగ్‌ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్‌ ట్రైనింగ్‌ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు కల్పించారు.

హెల్త్‌ అసెస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050గా నిర్ణయించారు..

దరఖాస్తు రుసుం: ఆన్‌లైన్ దరఖాస్తు రుసుం రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఓఎంఆర్‌ లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడించనున్నారు. పరీక్ష ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular