భువనేశ్వర్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గత బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఒరిస్సా రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత మంగళవారం రాత్రి ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో ప్రత్యేక విమానంలో ఒరిస్సా రాష్ట్రంలోని బోలాంగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అదేరోజు రాహుల్ గాంధీతో కలిసి ఆయన నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం తిరిగి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు చేరుకుని స్థానిక పిసిసి నేతల కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా నిర్వాహకులతో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలను చర్చించారు. గురువారం ఒరిస్సా రాష్ట్రంలోని ఫుల్బని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒరిస్సా పిసిసి అధ్యక్షుడు శరత్ పట్నాయక్, ఏఐసిసి నాయకులు భక్త చరన్ దాస్, ఆర్. సి. కుంతియా కలిసి డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.
మొదటి దశలో ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ, భువనేశ్వర్, కేరళ రాష్ట్రంలోని పాల్ ఘాట్ జిల్లాలోని అలత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించారు
మూడు రోజులుగా ఓడిషా లోడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విస్తృత ప్రచారం
- Advertisement -
- Advertisement -