- Advertisement -
లక్ష డప్పులు..వేల గొంతులు విజయవంతం చేయాలి
One lakh drums..thousands of voices should be successful
సికింద్రాబాద్
ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే ‘లక్ష డప్పులు వేల గొంతులు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా తీర్మానం చేయాలని ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగల 30 ఏళ్ళ ఆకాంక్ష అయిన ఎస్సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టి వర్గీకరణను అమలు చేయాలని కోరారు. లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సదస్సును ఈనెల 5వ తేదీన ఓయూలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సన్నాహక సదస్సు కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.
- Advertisement -