Monday, January 13, 2025

“ఒక్కటి తక్కువైంది పుష్పా!!!”

- Advertisement -

“ఒక్కటి తక్కువైంది పుష్పా!!!”

పుష్ప లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది –
షెకావత్ అంటాడు –

“ఒక్కటి తక్కువైంది పుష్పా !!!”

“One less pushpa!!!”
“One less pushpa!!!”


“ఒక్కటి తక్కువైంది పుష్పా!!!”

అంటాడే కానీ అదేంటో చెప్పడు???

“One less pushpa!!!”

తెలంగాణ సీఎం – రేవంత్ కూడా – తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కటి తక్కువైంది అనుకున్నాడు –

అది నిన్నటి మీటింగ్ తో కొంత వరకూ దక్కింది – ఆ మీటింగ్ వెన్యూ కూడా సెక్రటేరియట్ కానీ , సీఎంఓ ఆఫీస్ కానీ కాదు – కమాండ్ కంట్రోల్ రూమ్ కి రమ్మని – రేవంత్ తన ఎజెండా ని ఒక 20 నిముషాల్లో చెప్పాల్సింది చెప్పేశాడు – తర్వాత – దిల్ రాజు బయటికి వచ్చి – లోపల జరిగిన దానికి – మాట్లాడిన మాటలకు పొంతన లేదు . అసలు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల పెంపు లేకపోతే – తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కి ఇంకేం కావాలి ? ప్రభుత్వాల నుంచి . అది మాత్రం కుదరదు అని క్లియర్ గా తెలంగాణ సీఎం నిన్న మీటింగ్ లో స్పష్టం చేశాడు .

నిదానం గా తెలంగాణ సంస్కృతి / సంప్రదాయాలు మీద ఒకటి , రెండు సీన్లు పెట్టి , తెలంగాణ లోన్ వివిధ లొకేషన్స్ లో కంపల్సరీ గా షూటింగ్స్ తీయాలని కండిషన్లు పెట్టి, డ్రగ్స్ మీద , మహిళల భద్రత మీద కొన్ని వీడియోస్ చేయాలి అంటూ కొన్ని ప్రోటోకాల్స్ తో త్వరలోనే – స్పెషల్ షో లతో పాటు స్పెషల్ రేట్లు కి పర్మిషన్లు ఇవ్వొచ్చు.

కాకపోతే – నిన్నటి వరకూ – రేవంత్ ని టాలీ వుడ్ అసలు పట్టించుకోలేదు- ఆ ఒక్కటి మిస్ అయ్యింది…..

టాలీవుడ్ కి కేసీఆర్/ కేటీఆర్ తో బాగా సెట్ అయ్యింది.
మొదటి నుంచి – టాలీవుడ్ కి కాంగ్రెస్ ప్రభుత్వాలని – కాంగ్రెస్ సీఎం లని పట్టించుకోలేదు-
కానీ టాలీవుడ్ కి నిజం గా ఫేవర్స్ చేసింది – కాంగ్రెస్ సీఎం లే.
చంద్ర బాబు ఎప్పడు సీఎం అయినా – టాలీవుడ్ పెద్దలకి పండగే – ఆయన ఏం చేసినా, చేయకపోయినా, సీబీఎన్ పవర్ లో ఉంటే చాలు – అసలు టాలీవుడ్ వాళ్ళ దృష్టి లో సీఎం అంటే ఒక్క చంద్రబాబే- ఎటొచ్చి – ఇప్పుడు ఏపీ టీడీపీ తో రిలేషన్ బాలేదు- తనని రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు – తెలుగు సిన్ పరిశ్రమ సరిగ్గా రెస్పాండ్ అవలేదు అనే ఫీలింగ్ – సీబీఎన్ / లోకేష్ లలో బాగా నాటుకు పోయింది – దాంతో – టాలీవుడ్ ప్రముఖులకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు- ప్రస్తుతం అన్నింటికీ పవన్ కళ్యాణ్ ఒక్కడే దిక్కు అయ్యాడు .
నిన్నటీ మీటింగ్ లో తన ఎన్ కన్వెన్షన్ ని కూల కొట్టించి నా కూడా – నాగార్జున – రేవంత్ కి శాలువ కప్పి సత్కరించిన విధానం చాలా హుందా గా అనిపించింది.

ఇంకో పాయింట్ ఏంటంటే -ఇంటర్నేషల్ సినిమా హబ్ గా తెలంగాణ అవ్వాలంటే- సెలబ్రిటీ లు హైదరాబాద్ వచ్చినప్పుడు – చిన్న గొడవ జరిగినా- వాళ్ళే కారణం అని -వాళ్ళ పేర్లు ఎఫ్ ఐ ఆర్ లో చేర్చితే – ఎవరైనా మళ్ళా హైదరాబాద్ వస్తారా ?

షారుఖ్ / సల్మాన్ ల ఫంక్షన్ లో ఫాన్స్ తొక్కిసలాట జరిగి – గొడవ అయ్యి – ఏదైనా జరగ కూడని ప్రాణ నష్టం జరిగితే – వాళ్ళని రెస్పాన్సిబుల్ చేసి కేసులు కడితే- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బ తగలదా?
ఈ క్లారిటీ కు తగ్గట్లు – రాష్ట్ర ప్రభుత్వం కొన్ని క్లియర్ గా , ఫిక్స్డ్ గైడ్ లైన్స్ / మార్గదర్శకాలు ఒక జి ఓ రూపంలో రూపొందిస్తే – ఫ్యూచర్ లో ఎవ్వరికీ గ్యాప్స్ లేకుండా – ఆర్గనైజ్డ్ సిస్టం డెవలప్ అవుతుంది .

ఇక ఇప్పుడు – ఎన్ని చెప్పినా- పుష్ప లో షెకావత్ కు కానీ/ తెలంగాణ సీఎం – రేవంత్ కి కానీ – ఒక్కటి తగ్గింది – అన్నది- “రెస్పెక్ట్ “
ఇప్పుడు రేవంత్ కి టాలీవుడ్ లో ఐడెంటిటీ క్రియేట్ అయింది-నిన్న ఒక గంట వెయిటింగ్ చేయించిన తర్వాత తర్వాత – తెలుగు సినిమా పెద్దలు నుంచి దొరికిన / ఇచ్చిన – వచ్చిన – రెస్పెక్ట్ -తో.

– సత్య కేశరాజు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్