- Advertisement -
నిజమైన రైతులకే రైతుభరోసా అందాలి : మంత్రి తుమ్మల
Only real farmers should get Rythu Bharoshi :
ఖమ్మం న జూలై 10
ిజమైన రైతులకే రైతుభరోసా అందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా నుంచి రైతుభరోసా సదస్సులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో రైతుభరోసా విధివిధానాలపై అభిప్రాయాల సేకరించినట్లు తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అభిప్రాయాలు సేకరణ జరిగిందని వెల్లడించారు.ప్రజల ఆలోచనల మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుందని తుమ్మల అన్నారు. గతంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని ప్రజలు గమనించారని వ్యాఖ్యానించారు. చిన్న, సన్నకారు రైతులకు చేయూత నిచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. రైతుల అభిప్రాయాల సేకరణ తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు.
- Advertisement -