ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం.
Operation SMILE-XI was successful with the coordination of government departments.
కమీషనరేట్ లో 88 మంది బాలలకు విముక్తి..
గోదావరిఖని
:
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన/ వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపని లలో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా కమీషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-XI కార్యక్రమం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం గా ముగిసిందని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) ఒక ప్రకటనలో తెలిపారు. కమీషనరేట్ పరిధిలో ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్.ఐ మరియు నలుగురు సిబ్బందిని నియమించి టీం లు ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాన్ని కమీషనరేట్ వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందనీ, దానిలో *కమీషనరేట్ పరిదిలో 88 మంది బాల బాలికలను గుర్తించడమైనదని తెలిపారు. పెద్దపల్లి జిల్లా పరిదిలో బాలురు-11, బాలికలు – 03 మొత్తం మంది – 14, మరియు 02 కేసులు నమోదు చేసి 04 బాలకార్మికులని విముక్తి చేసి పాఠశాల లో చేర్పించడం జరిగినది. మంచిర్యాల జిల్లా పరిదిలో బాలురు-55, బాలికలు – 19 మొత్తం మంది-74 మంది మరియు 01 కేసు నమోదు చేసి 02 బాలకార్మికులని బాలకార్మికులని విముక్తి చేసి పాఠశాల లో చేర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ… బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, మరియు ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం జరుగుతుందనీ, అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, ఎక్కడైనా పనిచేసిన, తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 (చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) వారికి మరియు డైల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరనీ తెలిపారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసు శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని సీపీ అభినందించారు.