Monday, January 13, 2025

హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు

- Advertisement -

హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు

Party responsibilities to Harish Rao

హైదరాబాద్, జనవరి 8, (వాయిస్ టుడే)
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఒక స్పష్టత అయితే వచ్చింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ ఖాయమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఏసీబీ అరెస్ట్ చేస్తే బయటకు బెయిల్ పై వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు. దీంతో న్యాయనిపుణులతో న్యాయపరమైన అంశాలు మాత్రమే చర్చించిన కేటీఆర్ పార్టీ కార్యక్రమాలను ఎవరు తీసుకెళతారన్న దానిపై కూడా గులాబీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నందినగర్ లోని కేటీఆర్ నివాసం నుంచే ఎర్రవెల్లి ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ తో కూడా ఈ విషయాలను చర్చించినట్లు తెలిసింది. కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఎవరి నాయకత్వంలో పార్టీ పనిచేయాలన్న దానిపై కూడా సమాలోచనలు జరిపారు. అయితే కొందరు ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత పేరు చెప్పారని తెలిసింది. అయితే కేసీఆర్ ఇందుకు అంగీకరించలేదని అంటున్నారు. కవితకు పార్టీ పగ్గాలు తాత్కాలికంగానైనా అప్పగించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హరీశ్ రావు విషయంలోనూ ఆయన అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. కవిత, హరీశ్ రావుల పేర్లు కేటీఆర్ జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ కార్యక్రమాలను చేపడితే బాగుంటుందన్న సూచనలను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోసిపుచ్చినట్లు చెబుతున్నారు. కేటీఆర్ లేని సమయంలో పార్టీ కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షించాలన్న దానిపై తాను నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ నేతలకు చెప్పినట్లు తెలిసింది.కానీ నేతలు చెబుతున్న సమాచారం మేరకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించడం కంటే తానే బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాలకు పిలుపునివ్వడం మంచిదన్న యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో తాను ఇకబయటకు రాక తప్పదని కూడా కేసీఆర్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తానే వచ్చి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి రాష్ట్రంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేటీఆర్ అరెస్ట్ అయిన వెంటనే ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రిస్క్ తీసుకుంటున్న కేటీఆర్
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కట్టివేసింది. అరెస్టు నుంచి కల్పించిన రక్షణ కూడా ఎత్తి వేసింది. ఉదంయ తీర్పు రాగానే సాయంత్రం అలా కేటీఆర్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన న్యాయపోరాటం ఆయనకు రిస్క్‌గా మారుతుందని.. ధైర్యంగా నిలబడి విచారణ ఎదుర్కొంటే ప్రజల నుంచి సానుభూతి అయినా వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ఇప్పుడు సుప్రీంలోనూ ఊరట లభించకపోతే అన్ని న్యాయపరమైన అవకాశాలను కోల్పోవడంతో పాటు కేసులో ఏదో ఉందని అందుకే ఆయనకు రిలీఫ్ దక్కలేదని ప్రజల్లో ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఎలాంటి అవినీతి లేదని కేటీఆర్ గట్టిగా వాదిస్తున్నారు. ఇందులో పస లేదని లొట్టపీసు కేసు అని హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత కూడా వ్యాఖ్యానించారు. అందుకే ఆయన న్యాయపోరాటానికి మొగ్గు చూపారు.  ఈ క్రమంలో ఆయన  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం ఎందుకని తప్పు చేయనప్పుడు ఎందుకు అలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. నిజాయితీ పరుడు అయితే నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. అయితే రాజ్యాంగపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకునే హక్కు తనకు ఉందని.. అందుకే సుప్రీంకోర్టుకు పోయామని న్యాయపోరాటం చేస్తున్నామని  కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏసీబీ లేదా ఈడీ ఎలాంటి దూకుడు చర్యలు తీసుకున్నా కేటీఆర్ కు రాజకీయంగా ప్లస్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అరెస్టులు చేయడం వల్ల రాజకీయంగా ఆయనకు సానుభూతి వస్తుంది తప్ప  దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండదని ఇప్పటి వరకూ జరిగిన రాజకీయాలతో ఎవరికైనా అర్థం అవుతుందని కాంగ్రెస్ నేతలూ బహిరంగంగానే చెబుతున్నారు. అదే కక్ష సాధింపులు అనే భావన ప్రజలకు రాకుండా న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకున్న తర్వాత అరెస్టు చేస్తే కేటీఆర్ తప్పు చేసినందునే న్యాయవ్యవస్థ రిలీఫ్ ఇవ్వలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. అప్పుడు అరెస్టు చేసినా రియాక్షన్ రాదని అనుకుంటూ ఉండవచ్చు.  అందుకే అరెస్టు చేయకుండా కేటీఆర్ కు అన్ని న్యాయపరమైన అవకాశాలను కల్పిస్తున్నారని భావిస్తున్నారు. పిటిషన్ వేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు వస్తాయన్నదానిపైనే కేటీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఏసీబీ సుప్రీంకోర్టులో కేవియట్ వేసినట్లుగా ప్రచారం  జరుగుతోంది.  ఏసీబీ అధికారులు గ్రీన్ కో తో పాటు సబ్సిడరీ కంపెనీల్లో సోదాలు ప్రారంభించారు.  ఈ కేసులో ఏ టుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుుమార్, ఏ త్రీగా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ ఉన్నతాధికారి బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారు కూడా విచారణకు హాజరు కాలేదు. తమకు సమయం కావాలని కోరారు. దాంతో వారికీ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని ప్రశ్నించిన తర్వాతనే కేటీఆర్ ను ప్రశ్నించాలని ఈడీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. విచారణలకు అయితే హాజరవుతారు కానీ.. ఏసీబీ కానీ ఈడీ కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ తేలే వరకూ చర్యలు తీసుకోకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్