సేఫ్టి పరీక్షల్లో పతంజలి ఫెయిల్
ముంబై, మే 21, (వాయిస్ టుడే)
అత్యంత జనాధరణ పొందిన ప్రొడక్ట్స్ లో ‘పతంజలి ప్రొడక్ట్స్’ ఒకటి. ఇండియాలోనే కాదు.. విదేశాలకు కూడా పంతజలి తమ ప్రొడక్ట్స్ ను ఎగుమతి చేస్తుంటుంది. కొవిడ్ సమయంలో పతంజలి ఆయుర్వేదిక్ ప్రొడక్స్ట్ కు మార్కెట్ లో తీవ్ర కొరత ఏర్పడిందంటే వాటి వాడకం ఎంత మేరకు ఉందో అర్థం అవుతుంది.అయితే, వాటిలో నాణ్యత సరిగా ఉండడం లేదని చాలా సార్లు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు అవి రుజువవుతుంటాయి కూడా.. 2019లో జరిగిన కేసుకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ సహా ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ పితోర్గఢ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. పతంజలి సోయా పప్పు ఆహార పరీక్షలో విఫలమైనందుకు ఆయుర్వేద లిమిటెడ్ కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.పితోర్గఢ్లోని బెరినాగ్లోని మెయిన్ మార్కెట్ లో లీలా ధార్ పాఠక్ దుకాణంలో సోన్ పాపిడీ (స్వీట్) గురించి ఆందోళనలు వ్యక్తం కావడంతో ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్ 2019, అక్టోబర్ 17న తనిఖీలు చేపట్టారు. నమూనాలు సేకరించి రాంనగర్ లోని కనాహా జీ డిస్ట్రిబ్యూటర్ కు, హరిద్వార్ లోని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కు నోటీసులు జారీ చేశారు. ఉధమ్ సింగ్ నగర్ లోని రుద్రాపూర్ లోని స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ లో 2019, మే 18న ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు.సోని పాపిడీ స్వీట్ నాణ్యతగా నాణ్యత లేదని రాష్ట్ర ఆహార భద్రత శాఖకు ల్యాబ్ నుంచి 2020, డిసెంబర్ న నివేదిక అందింది. దీంతో వ్యాపారవేత్త లీలా ధార్ పాఠక్, డిస్ట్రిబ్యూటర్ అజయ్ జోషి, పతంజలి అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి. విచారణ అనంతరం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లోని సెక్షన్59 ప్రకారం పాఠక్, జోషి, కుమార్ కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.5,000, రూ.10,000, రూ.25,000 జరిమానా విధించింది.‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టులో సమర్పించిన సాక్ష్యాలు ఉత్పత్తి నాణ్యతను స్పష్టంగా చూపించాయని’ ఫుడ్ సేఫ్టీ అధికారి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చెప్పిన ఆయన పతంజలి తన ప్రొడక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
సేఫ్టి పరీక్షల్లో పతంజలి ఫెయిల్
- Advertisement -
- Advertisement -