Friday, February 7, 2025

రైతు భరోసా డబ్బులు వేయండి

- Advertisement -

రైతు భరోసా డబ్బులు వేయండి

Pay the Raithu Barosa money

ఇది కొనసాగుతున్న పథకమే
ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్టకొట్టకండి..?
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్
ఎన్నికలు గ్రాడ్యుయేట్లు టీచర్లకే పరిమితం.  రైతు భరోసాతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశమే లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగొట్టారు. అసలే అన్నదాతలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్స్ లో వేయాల్సిందే. రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందే నని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీల అకౌంట్స్ లో వేయాల్సిందే. ఎన్నికల కోడ్ సాకుతో ఆపితే ఊరుకునేది లేదు. రైతు భరోసా పథకం కొనసాగుతున్న పథకమే అయినందున ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. పైగా జరిగే ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవి అయినందును ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేవన్నారు.  అవసరమైతే బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ పంపిందుకు కూడా సిద్ధమన్నారు. ఈ మేరకు బండి సంజయ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులను వెంటనే ఎంపిక చేసి మంజూరు చేయాలని కోరారు. ఒకవేళ ఎన్నికల సంఘం కోడ్ సాకుతో ఆయా పథకాలను నిలిపివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అఖిలపక్షంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసేందుకు అనుమతి తీసుకుందామని కోరారు. ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా పైసలు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ నెలలోనైనా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక, పంట పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ తరుణంలో చేతికందే సొమ్మును కూడా ఆపేస్తే రైతు నోట్లో మట్టికొట్టినట్లే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వీరిలో 40 వేల మందికి మాత్రమే మంజూరు చేసి మిగిలిన 99 శాతం మంది పేదల కడుపు కొట్టడం అమానవీయమన్నారు.
అట్లాగే వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీల కుటుంబాల బ్యాంకుల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 20 వేల 336 మంది ఖాతాల్లోనే డబ్బులు జమ చేసి,  మిగిలిన 9 లక్షల 79 వేల మందికిపైగా కూలీలకు జమ చేయకపోవడం అన్యాయమన్నారు.
అట్లాగే రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల కోసం అందిన 70 లక్షలకు పైగా దరఖాస్తుల్లో, దాదాపు 40 లక్షల మంది పేదలు ఇండ్లకు అర్హులని తేలితే ఇప్పటి వరకు 72 వేల 406 మందికి మాత్రమే ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి, మిగిలిన వారిని ఎంపిక చేయకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ప్రతి ఒక్క లబ్దిదారుడికి రైతు భరోసా సొమ్ము వేయడంతోపాటు మిగిలిన 3 పథకాలకు సంబంధించి లబ్ది చేకూర్చే ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్