పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి…జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
Pending works should be completed soon...District Collector Rahul Sharma.
జయశంకర్ భూపాలపల్లి,
జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రంధాలయ భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ… గ్రంధాలయ భవనానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం సింగరేణి అధికారులతో చర్చించి త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదనంగా, గ్రంధాలయంలో పుస్తకాల అమరిక కోసం అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని, పుస్తక విభాగం, పత్రికల విభాగాలకు వేర్వేరు పార్టిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే, ప్రస్తుత ప్రాంగణంలో ఉన్న సెల్ టవర్ పక్క నుంచి ప్రధాన గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి అధికారులతో చర్చించి గ్రంధాలయ ప్రాంగణంలో ఉన్న కర్రను తొలగించే చర్యలు కూడా తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంధాలయ కార్యదర్శి శ్రీలత, తహసిల్దార్ శ్రీనివాసులు, ఏఈ మహేందర్, గిర్దావర్ రామస్వామి, గ్రంధాలయ సిబ్బంది చంద్రమౌళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.