- Advertisement -
సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రజలను మోసగించారు
People were cheated in the name of super six schemes
కడప
కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దేశ చరిత్రలో ప్రజలకు గుర్తుండి పోయేలా పాలన అందిస్తే వాళ్ళను జీవితం మొత్తం గుర్తు పెట్టుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తులు చాలా తక్కువ.. అందులో ఎన్టీఆర్ ఒకరు, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఒకరు. వాళ్ల పేరు చెప్పగానే వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు ప్రజలకు గుర్తు కు వస్తాయని అన్నారు.
ఆ తర్వాత ప్రజలకు గుర్తు వచ్చే నాయకుడు వైఎస్ జగన్. ప్రజలకు ఎవరు మంచి చేసినా వాళ్ళను జీవితంలో మార్చిపోరు. చంద్రబాబు కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించాడు, ప్రస్తుతం సిఎం గా ఉన్నారు. కానీ ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. చంద్రబాబు పేరు చెప్పగానే మోసాలు, అభద్దాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవే ప్రజలకు గుర్తు వస్తాయి. ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు పాలన అందించినా కాకి కి గుర్తు లేదు.
అమరావతి పేరు చెప్పి గ్రాఫిక్స్ చూపి కాలం గడిపేస్తున్నారు.. కానీ అక్కడ కూడా ఏ అభివృద్ధి చేయడం లేదు. సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రజలను మోసగించారు. బాబు షూరిటి భవిష్యత్ కు గ్యారెంటీ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు గురించి ప్రజలకు జగన్ ముందు నుండి చెప్పారు. కానీ ప్రజలు నమ్మలేదు.. ఏదో మంచి చేస్తాడు లె ఓట్లు వేసి గెలిపించారు. ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఎన్నో పథకాలు ఇస్తామని ఒక్కటి నేరవేర్చలేదు. చంద్రబాబు మాట్లాడితే అన్ని అభద్ధాలే తప్ప ఒక్క నిజం కూడా ఏరోజు మాట్లాడిన దాఖలాలు లేవు. 8 నెలల కూటమి ప్రభుత్వం లో వేల కోట్ల రూపాయలు అప్పు చేసావ్ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రతి మంగళవారం అప్పు రోజు గా మార్చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలు , పరిశ్రమలు అన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ప్రజలు విజ్ఞులు, పాలిచ్చే అవును వద్దనుకుని, తన్నే గాడిద ను తెచ్చుకున్నాం అని బాధ పడుతున్నారు. ప్రజల తరఫున నిత్యం పోరాటాలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.
- Advertisement -