అంటరానితనం కొనసాగడం బాధాకరం
Perpetuation of untouchability is painful
డిఎచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్
దళిత హక్కుల పోరాట నూతన కమిటీ ఎన్నిక
జగిత్యాల
స్వాతంత్రం వచ్చిన 77సంత్సరాలు అవుతున్న దళితుల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగ హక్కులు నేటికి దళితలకు అందని ద్రాక్షగానే మిగిలాయాని దళిత హక్కుల పోరాట సమితి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాల్ల భూమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం జిల్లాలోని ఎండపల్లి మండల కేంద్రంలో డిఎచ్పీఎస్ నూతన కమిటి ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్ హాజరయ్యారు.
కమిటీ అధ్యక్షులుగా మంతెన క్రాంతి, ఉపాధ్యక్షులు కనుకుంట్ల మల్లేశం, కిరణ్, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల శంకరయ్య, సంయుక్త కార్యదర్శులు మంతెన రాజేష్, అనిల్, కోశాధికారి కొరవేణి రాజు,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా భూమేశ్వర్ మాట్లాడుతూ దళితుల హత్యలు మహిళలపై హత్యాచారలు అరికట్టడంలో రాష్ట్ర కేంద్రం ప్రభుత్వలు విఫలం అవుతున్నారని పేర్కొన్నారు.
దళితులకు రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వన్ని కోరారు.
గ్రామాల్లో ఇప్పటికి అంటరానితనం కొనసాగడం బాధాకరమని ఆవేదన చెందారు. ప్రైవెట్ రంగాలలో దళితులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.దళితుల రక్షణ కోసం ప్రత్యేక చట్ట తేవాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మంతెన రాజు, మంతెన స్వామి, కనుకుంట్ల రమేష్, రాజు, చెన్న అంజి, సత్తయ్య పాల్గొన్నారు.