Friday, January 17, 2025

కన్ఫ్యూజన్ లో  గులాబీ కేడర్

- Advertisement -

కన్ఫ్యూజన్ లో  గులాబీ కేడర్

Pink cadre in confusion

హైదరాబాద్, జనవరి 4, (వాయిస్ టుడే)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారా? పార్టీ వ్యవహరాలను కేటీఆర్ లేదా కవితకు అప్పగించారా? పార్టీ కేడర్ ఎందుకు కన్ఫ్యూజన్‌లో పడింది? సీఎం రేసు కోసం కేటీఆర్-కవిత పోటీ పడుతున్నారా? ఇదే చర్చ పార్టీ నేతలతోపాటు కేడర్‌ను వెంటాడుతోంది.అధికారం పోయిన తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. నేతల వలసలు కాసేపు పక్కన బెడితే.. వయోభారం కారణంగా మాజీ సీఎం కేసీఆర్ మునుపటి మాదిరి గా రాజకీయాల్లో యాక్టివ్ కాలేకపోతున్నారు.ఇక అసలు విషయానికొద్దాం..పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, రెండు వారాల కిందట ఫ్యామిలీ సభ్యులతో కేసీఆర్ సమావేశమయ్యార. దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు మరో ముగ్గురు కీలక నేతలు హజరయ్యారు. అనారోగ్యం, వయో భారం కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచన బయటపెట్టారట. పార్టీకి కావాల్సిన సలహాలు మాత్రం ఇస్తానని, మీ ముగ్గురు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని చెప్పారట పెద్దాయన.ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా తాను కొద్దిరోజులు కంటిన్యూ అవుతానని అన్నారట. వీలు కుదిరినప్పుడు అసెంబ్లీకి వచ్చి వెళ్తానని, సమావేశాలు సైతం మీరే చూసుకోవాలని తెలిపారట. అయితే పార్టీలో ఎవరికి ఏయే పదవులు అన్నదానిపై నోరు ఎత్తలేదని తెలుస్తోంది.ఇటీవల మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్, ప్రస్తుతం కేసీఆర్ రెస్టు తీసుకుంటున్నారని అన్నారు. అంతేకాదు పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని చెప్పడం వెనుక ఉద్దేశం ఇదేనని అంటున్నారు. దీంతో అధ్యక్షుడు పోటీకి కేటీఆర్-కవిత మధ్య పోటీ నెలకొందని తెలుస్తోంది.కార్యకర్తలతో సమావేశం పెట్టినప్పుడల్లా హార్డ్ కోర్ అభిమానులు మాత్రం కేటీఆర్ సీఎం.. కవిత సీఎం స్లోగన్ చేయడం కూడా అధిపత్యం ఎవరి ఎత్తులు వారు వేస్తున్నట్లు చెబుతున్నారు పార్టీ నేతలు. జరుగుతున్న పరిణామా లను గమనించిన కారు పార్టీ కార్యకర్తలు కాసింత డైలామాలో పడిపోయారు. రేపోమాపో స్థానిక ఎన్నికలు రానున్నాయి.  ఎన్నికల ముందు ఈ తరహా కన్ఫ్యూజన్ కరెక్ట్ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనివల్ల కేడర్ చెదిరిపోయే పరిస్థితి తలెత్తవచ్చని అంటున్నారు.పార్టీ వ్యవహారాలు కేటీఆర్-కవిత చుట్టూ తిరగడంతో హరీష్‌రావు మద్దతుదారులు ఆసక్తి గమనిస్తున్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా, తమ అభిమాన నేత నోరు మెదప పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై అప్పుడే పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైపోయిందిఒకప్పుడు రూరల్‌గా బలంగా ఉండేది కారు పార్టీ. మొన్నటి ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీలో అంతర్గత వ్యవహారాలు కేడర్‌తోపాటు నేతలకు మింగుడుపడడం లేదు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో  ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వెయిట్ అండ్ సీ.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్