33.3 C
New York
Tuesday, July 16, 2024

విద్య అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు

- Advertisement -

విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

-పాఠశాల గ్రౌండ్ లెవెలింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలి

-ప్రాథమిక విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ
-మంథని మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మంథని

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రణాళిక బద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గద్దలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  బిట్టుపల్లి గ్రామంలోని ఎంపిపిఎస్ , అంగన్వాడీ కేంద్రం, మంథని పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంథనిలోని జిల్లా పరిషత్ (బాలుర)ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ (బాలికల)ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలోనీ తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరీక్షించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు వచ్చాయా,పాఠ్యాంశాలు జరుగుతున్నాయా, మధ్యాహ్న భోజనం వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ప్రాథమిక తరగతుల విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరీక్షించారు.  విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, పిల్లలకు తప్పనిసరిగా చదవడం , రాయడం, బేసిక్ మ్యాథ్స్  రావాలని అన్నారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించి పెండింగ్ ఉన్న చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఏక్లాస్ పూర్ లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో నీరు నిల్వ ఉండడం గమనించిన కలెక్టర్ గ్రౌండ్ లెవెలింగ్ పనులు చేపట్టి వెంటనే పూర్తి చేయాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. పాఠశాలలో సగం నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు తరగతి గదుల పెండింగ్ పనుల వివరాలు, ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

బిట్టుపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్  గ్రామంలో గర్బీణులను 100 శాతం ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ చేసి, రెగ్యులర్ పరీక్షలు చేయించుకునేలా చూడాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అన్నారు.  బిట్టుపల్లి అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్ సౌకర్యం కల్పించాలని అన్నారు.

మంథనిలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో గతంలో 16 లక్షల అంచనా వ్యయంతో మంజూరు చేసిన స్టేజి, కిచెన్ షెడ్, ఎంట్రెన్స్ కమాన్, కారిడార్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకునీ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ తనీఖీలలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, ఏఈ పంచాయతీ రాజ్ అనుదీప్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!