ప్రజలపై భారాలు మోపే విద్యుత్ సంస్కరణలను నిలిపివేయాలి

- Advertisement -

ప్రజలపై భారాలు మోపే విద్యుత్ సంస్కరణలను నిలిపివేయాలి

Power reforms that burden people should be stopped

గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో సిపిఐ నిరసన కార్యక్రమం
సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్

గుంటూరు అక్టోబర్ 30
ప్రజలపై భారాలు మోపే విద్యుత్ సంస్కరణలను నిలిపివేయాలని, ట్రూ అప్ చార్జీలను నిలపివేసి ప్రజలపై భారం పడకుండా చూడాలని గుంటూరు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక శంకర్ విలాస్ సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి  జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, అసలే నిత్యజీవిత అవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, రాష్ట్ర ప్రజల జీవన పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉంటే, మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ బారాలను మోపడం సమంజసం కాదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసి వాపక్ష, ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆనాడు విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. 8,114 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారని నవంబర్ మాసం నుంచి ఈ భారాలు వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదించడం ఆందోళన కలిగిస్తుందని, తక్షణమే విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించాలని, అలాగే మోడీ మిత్రులైన ఆదానికి లాభం చేకూర్చే విధంగా తీసుకొస్తున్న స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో మరో విద్యుత్ ఉద్యమం చేయడానికి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఏకతాటిపై కొచ్చి కూటమి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత వైసిపి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా పెంచుతుందని ప్రశ్నించారు. వెంటనే ట్రోప్ చార్జీల పేరుతో, సర్ చార్జిల పేరుతో విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడాన్ని సిపిఐ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, 6,072 కోట్లు ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వం భారయించి ట్రూ అప్ ఛార్జిలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కార్యవర్గ సభ్యులు జి.సురేష్ బాబు, ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, ఎన్. దేవా నాయక్, నగర సమితి సభ్యులు నూతలపాటి చిన్న, జంగాల చైతన్య, ధూపాటి వెంకటరత్నం, ఆకిటి రామచంద్రుడు, ఇరిగినేని వెంకటేశ్వరరావు, పి. జగన్నాథం మరియు యోగయ్య, మహమ్మద్ పిరా, వీర్రాజు, సురేష్, అంజి, నారాయణ, వలి, శీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular