- Advertisement -
ప్రధానమంత్రి సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలి యోజన పథకం
Pradhan Mantri Surya Ghar - Muft Bijili Yojana Scheme
గృహ వినియోగదారులకు మంచి సదవకాశము
మైలవరం,
మండల కేంద్రమైన మైలవరం లోని ఎన్టీఆర్ కూడలి నందు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలి యోజన పథకం ద్వారా, ప్రతి గృహానికి విద్యుత్ వినియోగం అయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ పథకం కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎంపీడీవో, విద్యుత్ శాఖ ఏఈ, ఎంపీపీ, అంగన్వాడి సిబ్బంది, ఎన్టీఆర్ జిల్లా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఎస్. లిల్లెమ్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -