Sunday, December 22, 2024

ఫైల్స్ రెడీఅవుతున్నాయి…

- Advertisement -

ఫైల్స్ రెడీఅవుతున్నాయి…

Preparing files...

రుషికొండ నుంచి అనంత వరకు
గుంటూరు, డిసెంబర్ 7, (వాయిస్ టుడే)
ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డూఅదుపు లేకుండా కబ్జాలు, సెటిల్‌మెంట్లు, వసూళ్ల దందా నడిచిందంటున్నారు కూటమి నేతలు. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు అందరి అరాచకాల ఫైల్స్‌ రెడీ చేస్తున్నామని అంటున్నారు. సిట్‌ దర్యాప్తు మొదలుపెట్టి..అందరికీ లెక్క పెట్టి మరీ వడ్డీతో సహా గట్టిగానే ఇచ్చి పడేస్తామని అంటున్నారు. గన్‌ చూపించి ఆస్తులు రాయించుకున్నారన్న ఆరోపణల నుంచి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాలు, దందాలు చేసిన కిందిస్థాయి నేతల వరకు అందరి లెక్కలు తీస్తున్నామంటోంది ప్రభుత్వం. ఎంత విధ్వంసం జరిగిందో త్వరలోనే ప్రజల ముందు వాస్తవాలను పెడుతామంటున్నారు లీడర్లు.ఐదేళ్లలో జరిగిన అక్రమాలు, ఆక్రమణల గుట్టు రట్టు చేసేందుకు..సీఎం ఆదేశాలతో రెండు నెలల కిందటే విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి..ఇతర విభాగాల అధికారులతో కలిసి..కబ్జాలు, దందాల లెక్కలపై విజిలెన్స్‌ సిబ్బంది ఆరా తీశారట. రెండు నెలల పాటు ఫీల్డ్ వర్క్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్‌ డిటేయిల్ దర్యాప్తు కోసం సిట్‌ను నియమించి బాధితులకు న్యాయం చేయాలని భావిస్తోందట ప్రభుత్వం.అధికార అండతో మాఫియా తరహా డీల్స్‌ జరిగాయట. రాష్ట్రస్థాయిలో గనులు, పోర్టులు, డిస్టిలరీలు, సెజ్‌లు, హోటళ్లు, రిసార్టులు..ఇలా ఒక్కటేమిటి..ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ అడుగు పెట్టి..అసలు వాటాదారులను, యజమానులను తరిమేశారన్న ఆరోపణలున్నాయి. ఇక జిల్లాస్థాయిలో కూడా ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమ అనుచరగణంతో చెలరేగిపోయారట. భూకబ్జాలు, దందాలతో జనాలను హింసించారట.కూటమి ప్రభుత్వానికి వందలూ, వేల సంఖ్యలో ఫిర్యాదుదారులు రావడంతో ఆరా తీస్తే ఒక్కో దారుణం బయటపడుతోందట. అప్పటి బాధితులందరికీ ఇప్పుడు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారట. వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి..బాధితులకు న్యాయం చేయడంతో పాటు..కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేసిన వాళ్లను వదిలిపెట్టొద్దని ఆర్డర్స్ ఇచ్చేశారట. విశాఖలో ప్రైవేటు భూముల ఆక్రమణ నుంచి అనంతపురంలో కియాకు బెదిరింపుల దాకా..చాలా అంశాలు విజిలెన్స్‌ రిపోర్టులో ఉన్నట్లు చెబుతున్నారు.రుషికొండ విధ్వంసం, గుడివాడ క్యాసినో, కాకినాడలో బియ్యం దందా, గోదావరి జిల్లాల్లో భూఆక్రమణ, గుంటూరులో ఆగడాలు..ఇలా క్రైమ్ ఫైల్స్ గోదాములే నిండిపోతున్నాయట. గ్రామస్థాయి భూకబ్జాల నుంచి రాష్ట్రస్థాయిలో జరిగిన అరాచకాలు..దందాల తీరు, తీవ్రత చూసి ఉన్నతాధికారులే షాక్ అయినట్లు తెలుస్తోంది. కళ్లుతిరిగేలా సాగిన ఈ క్రైమ్‌పై సినిమా తీస్తే పది స్వీక్వెల్‌లూ కూడా సరిపోవనట. సీరియల్‌ తీయాలంటే వందల ఎపిసోడ్లు కావాలని, వెబ్‌ సిరీస్‌ అయితే ఎన్ని సీజన్లు తీసినా అరాచకం ఫైల్స్‌ మాత్రం కొలిక్కిరాదంటున్నారు. సిట్‌ దర్యాప్తు స్టార్ట్ చేసి ఒక్కో జిల్లాలో ఒక్కో నేత వ్యవహారం ఏంటో త్వరలోనే బయటపెట్టబోతున్నారట.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్