అదిలాబాద్
అదిలబాద్ లో రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శ్రీకారం చుట్టారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం చేసారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసారు. పలు రైల్వే అభివృద్ధి పనులను కుడా ప్రారంభించారు. అంబారి- పింపల్కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్నగర్- మౌలాలి మార్గానికి శ్రీకారం చుట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పదేళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అనేక నిధులు వెచ్చించింది. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. ఆర్థిక వ్యవస్థ బలపడితేనే దేశంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనమని అన్నారు.
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్రంలో 3 వందేభారత్ రైళ్లను మోదీ ప్రారంభించారు. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు అందించిందని అన్నారు.
రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ
- Advertisement -
- Advertisement -