ఈనెల 8న మెట్ పల్లికి ప్రొఫెసర్ కోదండరాం రాక
రేపటి కోదండరాం సదస్సును
విజయవంతం చేయండి*
టీజేయస్ నేతలు చుక్క గంగారెడ్డి, కంతి మోహన్ రెడ్డి
మెట్ పల్లి,మే
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రో. కోదండరాం ఈ నెల 8 బుధవారం రోజున
మెట్ పల్లిలో పర్యటించనున్నారని
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి లు తెలిపారు. సోమవారం మెట్ పల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక మనోహర్ గార్డెన్ – మెట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గెలుపు కోసం బుధవారం ఉదయం 10-00 గంటలకు నిర్వహించే ఈ సదస్సులో కోదండరాం పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా టీజేయస్ మద్దతుతో బీఆర్ఎస్ సర్కార్ ని ఎలా పారదోలమో, అలాగే నేటి లోకసభ ఎన్నికల్లో కూడా బిజెపి ని పారదోలాడానికి టీజేయస్ పార్టీ కృషి చేస్తుందని గుర్తు చేశారు. కావున ప్రొఫెసర్
కోదండరామ్ పాల్గొననున్న రేపటి మెట్ పల్లి సదస్సులో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయన పర్యటనని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు అల్లంకి శ్రీనివాస్, మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు పసునూరి శ్రీనివాస్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జిల్లపల్లి దిలీప్ కుమార్, నాయకులు కాట దశరథ్ రెడ్డి, మ్యాన సతీష్, కేషపాక తరుణ్ తదితరులు పాల్గొన్నారు