దూడల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి
Proper care should be taken in rearing calves
ఏపీ ఎల్ డి ఏ డిడి రాజశేఖర్:: ఆదోని డిడి రమణయ్య
కౌతాళం
దూడల పెంపకంలో తగు జాగ్రతలు తీసుకుంటే దూడలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాయని ఏ పి ఎల్ డి ఏ రాజశేఖర్ మరియు ఆదోని డిడి రమణయ్య పేర్కొన్నారు. శుక్రవారం బాపురం గ్రామంలో ఏర్పటు చేసిన దూడల ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వారు మాట్లాడుతూ . దూడలకు నట్టల నివారణ మరియు వ్యాక్సిన్లు వేయించాలని మూడు నెలలకు ఒకసారి డి వార్మింగ్ తాగించాలని కోరారు. పశు పోషణ ఆహార సమతుల్యంగా ఉండాలని సంపూర్ణ ఆహారాన్ని అందించాలని పోషకాలు గల ఆహారాన్ని అందించాలని సూచనలు అందించారు. పశువులలో ఈతకు కనీసం నాలుగు నుంచి ఐదు నెలలు మధ్య ఉండాలని సూచనలు ఇచ్చారు. ఎదకు వచ్చిన పశువులను 24 గంటల లోపల ఎద సూదులు వేయించాలని సూచించారు. అనంతరం పుట్టిన దూడలను ర్యాలీగా నిర్వహించారు. అనంతరం రైతులకు టిడిపి నాయకులు మోహన్ రెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో పశువైద్యులు జగదీష్. మహేశ్వరి మరియు టిడిపి నాయకులు మోహన్ రెడ్డి. వెంకటరెడ్డి మరియు సబార్డినేట్ మొహమ్మద్ ఏ హెచ్ ఏ సైఫుల్. గోపాల్ మిత్ర రహీం భాషా పశుమిత్ర అజయ్ రాజకుమార్ పాల్గొన్నారు.