Friday, April 4, 2025

పీఎస్సార్ అంజనేయులును అరెస్టు చేయాలి

- Advertisement -

పీఎస్సార్ అంజనేయులును అరెస్టు చేయాలి

PSR Anjaneyulu should be arrested

ఐపియస్ అధికారుల తీరు పై బుద్దా వెంకన్న ఫైర్
విజయవాడ
ముగ్గురు ఐపియస్ అధికారులు ముంబై నటిని చిత్ర హింసలు పెట్టారు. విశాల్ గున్నీ స్టేట్ మెంట్ ను బట్టి సిఎంఓ కేంద్రం గా కుట్ర జరిగింది. జగన్ ఆదేశాలను పియస్.ఆర్ ఆంజనేయులు అమలు చేశారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారు. గతంలోకూడా పియస్.ఆర్ ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులు పెట్టాడు. డిసిపి రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. గున్నీ రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులు ను అరెస్టు చేసి పోలిస్ కస్టడీలోకి తీసుకోవాలి. అతన్ని విచారిస్తే అనేక వాస్తవాలు బయటకి వస్తాయి. సిఎంఓ లో జగన్ పాత్ర కూడా వెలుగులోకి వస్తుంది. ఒక ఆడపిల్లను  ముగ్గురు ఐపియస్ లు  హింసించారని  తేలింది. తప్పు చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలి. పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించాలి. ఆనాడు జగన్ చెప్పినట్లు మాట్లాడిన అధికారులు మీ పోలీసులు నిర్వాకం పై మాట్లాడరా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం లో చంద్రబాబు, నారా లోకెష్ లను అనేక సార్లు అడ్డుకున్నారు. కక్ష పూరితంగా చేసిన ఆనాటి అధికారులు పాత్ర పై విచారణ చేయించాలి. వీళ్లను వదిలేస్తే ఇలానే మళ్లీ చేస్తారు.. అలా జరగకూడదు. కక్ష పూరిత రాజకీయాలు వద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాకు చెప్పారు. మీమీద ఉన్న గౌరవంతో మేము సైలెంట్ గా ఉన్నాం. కానీ ఆ ఘటనలు పై విచారణ చేసి  చర్యలు తీసుకోవాలి. పియస్.ఆర్ ఆంజనేయులు ను అరెస్టు చేసి విచారణ చేస్తే అందరూ బయటకి వస్తారు. ప్రభుత్వం ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్