రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసు – విజయ్ పాల్ అరెస్టు
Raghurama Torture Case - Vijay Pal Arrested
సుదీర్ఘ విచారణ తర్వాత విజయ్పాల్ను అరెస్టు చేసిన పోలీసులు
ఒంగోలు
మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్. విజయ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్
పాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు, రాత్రి 9 గంటల సమయంలో విజయ్ పాల్ ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ
విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
రాత్రికి స్టేషన్లో ఉంచేందుకు ఏర్పాట్లు: ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు సుదీర్ఘంగా విజయ్పాల్ను విచారించారు. అనంతరం విజయ్ పాల్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ఈ మేరకు విజయ్ పాల్
రిమాండ్ రిపోర్టును పోలీసులు సిద్ధం చేశారు. విజయ్ పాల్ ను రాత్రికి ఒంగోలు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. బుధవారం ఉదయం గుంటూరు తరలించారు.