Saturday, February 8, 2025

ఆంధ్ర రాష్ట్రానికే మణిహారం విశాఖ ఉక్కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

- Advertisement -

ఆంధ్ర రాష్ట్రానికే మణిహారం విశాఖ ఉక్కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Ramprasad Reddy, State Transport Minister, Maniharam Visakha Steel for Andhra State

రాయచోటి, జనవరి 21:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రామ ప్రసాద్ రెడ్డి  తెలిపారు. మంగళవారం రాయచోటి లోని టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం లాంటిదన్నారు. వేలాదిమంది తెలుగు వారు కలిసి వీరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్జీవింప చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందన్నారు.నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లే వారిని ఆరోపించారు. నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తి నాకు వెళ్లి వస్తున్నారన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినా పర్యటన వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ కు  కేంద్రం గుడ్ న్యూస్ చెబుతూనే ఉంది. నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడేందుకు రూ.11.440 కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసిందన్నారు.విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు నాయుడు అహర్నిశలు ప్రేమిస్తున్నారన్నారు.ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి కి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పుల్లో కూరుకుపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఈ సంక్షేమం నుంచి గట్టెక్కాలంటే రూ.18 వేల కోట్లయినా అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎంపీ భరత్ తదితరులు విన్నవించిన కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జిఎస్టి చెల్లింపులకు రూ. 500 కోట్లు, ముడి సరుకుకు  సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు రు. 1.150 కోట్లు చొప్పున మొత్తం రూ.1.650 కోట్లను రెండు విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం అందించిందన్నారు.
నేడు స్టీల్ ప్లాంట్ ను సంక్షేమం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు కృషికి ఫలితంగా రూ.11.440 కోట్ల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమన్నారు.1994లో నష్టాల పేరుతో బి ఐ ఎఫ్ ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యస్తీకరణ జరపకుండా ప్లాంట్ ను అమ్మడానికి ప్రయత్నించింది. అందుకు ఎర్ర నాయుడు గారి నేతృత్వంలో టిడిపి ఎంపీలు పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు.1998లో నాటి ప్రధాని వాజ్పేయి గారితో మాట్లాడి రూ.1.650 కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చాలని రుణంపై వడ్డీని మాఫీ చేసి బి ఐ ఎఫ్ ఆర్ కు వెళ్లకుండా తప్పించాలని టిడిపి ఎంపీలు కోరడంతో నాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ రూ.1.333 కోట్లు రుణాన్ని ఈక్విటీగా మార్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్  సమగ్రాభివృద్ధి కోసం కన్సల్టెంట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు.అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి స్టీల్ ప్లాట్ ను గట్టెక్కించింది చంద్రబాబు నాయుడు నని వివరించారు. తప్పుడు కూతలతో వైసిపి ఎంత దుష్ప్రచారం చేసిన వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో టిడిపి నాయకులు మదన్మోహన్ రెడ్డి సుబ్బరాజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్