మూడు రోజులపాటు రథసప్తమి వేడుకలు వైభవం జరగాలి
Rathasaptami celebrations should be held in grandeur for three days
తొలిసారి హెలికాప్టర్ టూరిజం
హెలికాప్టర్ నిర్వహణపై సమీక్ష
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం,
అరసవిల్లి రథసప్తమి వేడుకలను జిల్లాలో మూడు రోజుల పాటు అంబరాన్ని తాకేలా నిర్వహించనున్న వేడుకలలో భాగంగా తొలిసారి హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.జిల్లా కలెక్టరెట్ సమావేశం మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమావేశం నిర్వహించారు. రథసప్తమి ఉత్సవాలను మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఘనంగా శోభ యాత్ర, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామూహిక సూర్య నమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయని, మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్, కర్రసాము, సంగిడీలు, ఎద్దుల బండ్ల పోటీలు, వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తామని, అలాగే డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్స్ షో నిర్వహించడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో హెలికాప్టర్ నిర్వాహకులకు సైట్ చూపించడం జరిగింది. హెలికాప్టర్ నిర్వహణకు సంబంధించి చేపట్టవలసిన భద్రాతా చర్యలపై సమీక్షించారు. నిర్వహణకు సంబంధించి నిబంధనల విధిగా పాటించాలన్నారు. వెబ్సైట్ లో టికెట్ బుకింగ్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు, అలాగే ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. టికెట్ తీసుకున్న యాత్రికులు ఎలా హెలిపేడ్ కి చేరుకోవాలి, వారికి వేచి ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎపిఈపిడిసిఎల్ డచ్ బిల్డింగ్ వద్ద విద్యుత్ అందుబాటులో ఉండేలా, అలాగే మునిసిపల్ అధికారులు పరిసరాలు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, డ్వామా పి డి సుధాకర్ రావు, కొవ్వాడ ప్రత్యేక ఉప కలెక్టర్ లక్ష్మణరావు, జిల్లా విపత్తు నివారణ అధికారి మోహన రావు, ఎ ఈ సురేష్ సంబంధిత అధికారులు సిబ్బంది హాజరైయారు.