రియల్ ఎస్టేట్ బిల్డర్స్ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు
Real estate builders should not commit suicide
వనపర్తి
రియల్ ఎస్టేట్ రంగము స్తబ్దత వల్ల గిరాకి లేక మేడ్చల్ జిల్లా కొంపల్లి లో బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం: రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అన్సార్ హుస్సేన్.అన్నారు రియల్ ఎస్టేట్ రంగము స్తబ్దత వల్ల గత మూడు నాలుగు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, మరియు నిర్మాణారంగంపై ఆధారపడిన చిన్నచిన్న ఇంజనీర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ బ్యాంకులు , , ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకున్న రుణాన్ని తీర్చలేక దానితోపాటు హైడ్రా ప్రభావంతో కూడా క్రయవిక్రయాలు జరగక చాలామంది తొందరపాటులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దయచేసి మిత్రులారా ఎవరు కూడా అఘాయిత్యాలకు పాల్పడకూడదు ధైర్యముగా మన సమస్యల పరిష్కారానికి అందరము కలిసి గట్టిగా మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్దాం. అన్నారు హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఆకాశ హార్మ్యాలు నిర్మాణాలు పూర్తి అయ్యి విక్రయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామాలలో గ్రామపంచాయతీ లేఔట్ఫై విధించిన ఆంక్షలా వల్ల ప్లాట్ల విక్రయాలు జరగక ఎన్నో ఇబ్బందులకు ఎదురవుతున్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో G2/257/2019 ను వెంటనే రద్దుచేసి గ్రామపంచాయతీ లేఔట్స్ లో మిగిలి ఉన్న ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. రియల్ ఎస్టేట్ రంగా సమస్యలపై వివిధ శాసనసభ్యులకు మరియు మంత్రులకు కలెక్టర్లకు, సంఘము తరపున ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ రెండు రోజులలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని , డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తాం. వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు త్వరలోనే కలిసి సంఘము తరపున సహాయ సహకారాలు అందిస్తాం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు, బిల్డర్లు, నిర్మాణరంగంపై ఆధారపడిన వ్యాపారులు అందరూ ధైర్యంగా ఉండండి బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుంది రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జలడా సురేష్ జిహెచ్ఎంసి ఉపాధ్యక్షురాలు సరోజ , రెహమాన్ ,నాగరాజు , మేరీ ధర్మ పాల్గొన్నారు