*రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ రిలీజ్*

- Advertisement -

*రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ రిలీజ్*

*Release of Second Lyrical Video Song 'Egire Guvvalaga...' from Ram Gopal Varma's movie 'Shari'*

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ  ‘శారీ’ లాగ్ లైన్: ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’.  గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త  రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా  పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘శారీ’ మూవీ రూపొందుతోంది. ఈ రోజు RGV డెన్ లో ‘శారీ’ చిత్రానికి సంబందించిన సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ విడుదల చేసారు.
ఈ రోజు  ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ ద్వార  సెకండ్ లిరికల్ సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ రిలీజ్ చేసామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ పాట రాకేష్ పనికెళ్ళ ట్యూన్ చేసి లిరిక్ కూడా అతనే ఇచ్చాడని, పాటలో సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఈ పాటను సింగర్ సాయి చరణ్ పాడారని ఆయన తెలిపారు.
నిర్మాత రవి శంకర్ వర్మ మాట్లాడుతూ  “మా ‘శారీ’ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ ఇటివల విడుదల చేసిన ‘ఐ వాంట్ లవ్’ కి విశేష స్పందన లభించింది. ఈ రోజు సెకండ్ లిరికల్ సాంగ్  ‘ఎగిరే గువ్వలాగా…’ రిలీజ్ చేసాము.  ఇంకా  హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో కూడా ఈ రోజే  ఈ  సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేసాము. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయ్, కొన్ని అనివార్య కారణాల వలన విడుదల ఆలస్యం అయింది త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తాము” అన్నారు.
బ్యానర్ : ఆర్జీవీ – ఆర్వీ ప్రొడక్షన్స్ LLP
నటీనటులు : సత్యా యాదు, ఆరాధ్య దేవి, సాహిల్ సంభవాల్, అప్పాజీ అంబరీష్, మరియు కల్పలత తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular