రెసిడెన్షియల్ స్కూలు మరియు జూనియర్ కళాశాల సందర్శించిన–జిల్లా కలెక్టర్
Residential School and Junior College visited--District Collector
సిద్దిపేట
కొండపాక మండలంలోని దుద్దెడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల బాలురు.. కొండపాక లో ఉన్న జగదేవపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్.. జూనియర్ కళాశాల బాలికలు.. మరియు కొండపాక మండల కేంద్రంలో గల వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని
జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి
ఆకస్మికంగా సందర్శించి ఆయా హాస్టల్లో భోజనం, వసతి మరియు విద్యా సౌకర్యాలను పరిశీలించారు. ముందుగా దుద్దెడ టీజీడబ్ల్యూ ఆర్ఎస్ జెసి ని సందర్శించి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులతో వార్షిక పరీక్షల ప్రిపరేషన్ గురించి వాకబ్ చేశారు. మార్చి 6 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నందున 100% ఉత్తీర్ణత సాధించాలంటే అన్ని సబ్జెక్టులను రిపీటెడ్ గా చదవాలని అన్నారు. ముఖ్యంగా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టులను ప్రాక్టీస్ చేస్తూ కఠిన తరమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు మంచిగా రాసేలా స్లిప్ టెస్ట్ లు ఎక్కువ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంటగదిని హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆకుకూరలు అధికంగా ఉండేలా మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ కృష్ణను ఆదేశించారు.
టీజీడబ్ల్యూఆర్ఎస్,జేసీ బాలికల గురుకుల విద్యాలయంలో వంటగది, స్టోరేజ్ రూములను పరిశీలించి మెనూ ప్రకారం అందించాలని, ఎక్స్పైరీ దగ్గర పడ్డ వంట సరుకులను వాడ రాదని, ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని ప్రిన్సిపాల్ సవితను ఆదేశించారు.
అనంతరం బీసీ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థినిల లివింగ్ రూమ్స్ పరిశీలించి పైకప్పుకు పెయింట్స్ వేయించుకోవాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులు వివిధ స్కూళ్లకు చదువుకోవడానికి వెళుతున్నందున వారి సెక్యూరిటీగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం కామన్ డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించుటకు మరియు పెంచిన డైట్ చార్జీలు మరియు కాస్మెటిక్ చార్జీల ప్రకారం విద్యార్థులకు అవి సక్రమంగా అందుతున్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని అన్నారు. ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులను వాడ రాదని వాటి స్థానంలో ఫ్రెష్ సరుకులను వాడాలని చెప్పడం జరిగింది, బియ్యం కు సంబంధించి అవసరమైతే సివిల్ సప్లై ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వం కల్పించిన కనీస అవసరాలు అన్ని గురుకులాలు, హాస్టల్లో విద్యార్థులకు లభించేలా పర్యవేక్షణ చేస్తున్నామని, పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత 10/10 జీపి సాధించేలా ఫోకస్ పెట్టేలా పర్యవేక్షణ చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించడం జరిగింది అని అన్నారు.
కలెక్టర్ వెంటా తాసిల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.



