Tuesday, March 10, 2026

రిటైనింగ్ వాల్ రాజకీయం

- Advertisement -

రిటైనింగ్ వాల్ రాజకీయం

Retaining wall politics

విజయవాడ,  సెప్టెంబర్ 4 (న్యూస్ పల్స్)
విజయవాడ  వాసులని ఊహించని వరదలు ముంచెత్తాయి. సింగ్‌నగర్‌తో పాటు నగర శివారు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అక్కడి వారంతా ఉంటున్న ఇళ్లు వదిలి తట్టాబుట్టా  సద్దుకుని… పునరావాసకేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి. అలా కాకపోతే… ముంపులోనే కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి. అయితే… ఎప్పుడూ నీట మునిగే… కృష్ణలంక, రాణిగారితోట  ప్రాంతాలు మాత్రం వరద  ముంపు నుంచి తప్పించుకున్నాయి. దీనికి కారణం కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌. ఇదే ఆ ప్రాంతాలను వరద ముంచెత్తకుండా కాపాడింది. వేల కుటుంబాలను కాపాడింది. రిటైనింగ్‌ వాల్‌ లేకపోయింటే… కృష్ణలంకతోపాటు రాణిగారితోట మునిగిపోయేవి. రిటైనింగ్‌ వాల్‌.. ఆ రెండు ప్రాంతాలను కాపాడింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం… అయితే ఏపీలో ఈ అంశంమే ఇప్పుడు రాజకీయ రగడకు కారణమైంది. వేలాది కుటుంబాలను వరద ముప్పు నుంచి తప్పించిన కృష్ణలంక రిటైనింగ్‌ను  కట్టింది తామంటే తామని అంటున్నాయి టీడీపీ, వైసీపీ. రిటైనింగ్‌ వాల్‌ క్రెడిట్‌ కోసం పోటీ పడుతున్నాయి. కృష్ణలంక రిటైనింగ్‌ వాల్  మొత్తం 12లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా దీన్ని నిర్మించారు. 474.51 కోట్లతో.. మొత్తం.. 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజీ కింద ఈ వాల్‌ నిర్మాణం జరిగింది. మొత్తం  ఆరు డివిజన్లకు రక్షణగా ఈ ప్రవహరీ గోడను ఏర్పాటు చేశారు. దీని వల్ల… ఇప్పుడు వేలాది కుటుంబాలు ముంపు బారిన పడకుండా తప్పించుకున్నాయి. కృష్ణలంక రిటైనింగ్ వాల్ లేకపోయింటే… విజయవాడలో కలలో కూడా ఊహించలేని  విధ్వంసం జరిగి ఉండేదిరిటైనింగ్‌ నిర్మాణంపై ఇప్పుడు టీడీపీ , వైఎస్‌ఆర్‌సీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రిటైనింగ్‌ వాల్‌ కట్టింది తామే అని వైఎస్‌ఆర్‌సీపీ అంటుంటే… చరిత్ర తెలుకోకుండా మాట్లాడొద్దని టీడీపీ కౌంటర్‌ ఇస్తోంది..? ఇంతకీ రిటైనింగ్‌ వాల్‌ క్రెడిట్‌ ఎవరికి దక్కుతుంది…? అసలు ఏం జరిగింది…?విజయవాడ కృష్ణ రివర్ రిటైనింగ్ వాల్ ప్రాజెక్టు ఫేజ్‌-1 నిర్మాణ పనులు కాంగ్రెస్‌ హయాంలో 2009లో ప్రారంభించారు. 2009 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో కనీసం ఫేజ్‌-1 పనులు కూడా పూర్తిచేయలేకపోయారు. 2019లో వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం ఏర్పడింది. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే రిటైనింగ్‌ వాల్‌ ఫేజ్‌-1 నిర్మాణ పనులతోపాటు ఫేజ్‌-2, ఫేజ్‌-3 కూడా పూర్తి చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ అంటోంది. తాము పూర్తిచేసిన కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌… విజయవాడకి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడలో ఎన్నో వేల కుటుంబాల ప్రాణాలు, ఆస్తులను కాపాడింది. తాము నిర్మించింది ఈ రిటైనింగ్‌ వాల్‌కు‌… విజయవాడ చరిత్రలో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని వైసీపీ చెప్తోంది. అంతేకాదు.. మంచి చేసేందుకు  మనసు రాని చంద్రబాబు…. జగన్‌ ప్రభుత్వంలో నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ క్రెడిట్‌ను కొట్టేసేందుకు ముందుంటాడంటూ విమర్శిస్తున్నారు.కృష్ణలంక దగ్గర రిటైనింగ్‌ వాల్‌ 2019లో చంద్రబాబు హయాంలోనే నిర్మించారని టీడీపీ  శ్రేణులు అంటున్నారు. కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది చంద్రబాబే అంటూ పోస్టులు పెడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు అబద్ధాలు చెప్పినా… గూగుల్‌  అబద్దాలు చెప్పదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ ట్విట్టర్‌ ఖాతాలో కూడా చంద్రబాబు హయంలో పూర్తయిన రిటైనింగ్‌ వాల్‌ విజువల్స్‌ను పోస్టు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్