Thursday, January 16, 2025

చట్టం నీకు, కాంగ్రెస్ నాయకులకు చుట్టమా రేవంత్ రెడ్డి ?

- Advertisement -

చట్టం నీకు, కాంగ్రెస్ నాయకులకు చుట్టమా రేవంత్ రెడ్డి ?

Revanth Reddy, does the law come to you and Congress leaders?

రేవంత్ రెడ్డి మూల్యం  చెల్లించ తప్పడు
హైదరాబాద్
సినీనటుడు అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవను, అన్ని వర్గాల మీద చూపాలనే బీఆర్ఎస్ కోరుతున్నదని  మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
ఒక వ్యక్తిని టార్గెటెడ్ గా చేసి కేసులు పెడుతున్నట్లుగా కనబడుతున్నది. ఆ అమ్మాయి చనిపోవడం దురదృష్టకరం. మరి అలాగే నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, 50 మందికి పైగా గురుకుల పిల్లలు చనిపోతే, ఆ పిల్లల ప్రాణాలకు విలువ లేదా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ అని అయన ప్రశ్నించారు.
ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎందుకు ఒక్క రూపాయి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు? ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ మంత్రిగా మీరే ఉన్నారు కదా.   అదే విధంగా నీ తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి, సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే  ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ కాలేదు? ఇంతవరకు నీ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేదు? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా.. చట్టం నీకు చుట్టమైందా? 80 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోతే నీలో చలనం లేదు. 450 మందికి పైగా రైతులు చనిపోతే నీలో చలనం లేదు. కానీ, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఉద్దేశపూర్వకంగా చేయడం వల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బతిని, నష్టం జరిగే అవకాశం ఉన్నది.  నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడిచేసిన కాంగ్రెస్ గుండాలు అందరూ ఆయనతో ఫోటోలు దిగినోళ్లే ఇవాళ వాళ్లనే తీసుకొనిపోయి అల్లు అర్జున్ ఇంటిమీద దాడి చేశారు.  సిద్ధిపేటలో కూడా గూండాలతోని నా క్యాంపు ఆఫీసు మీద దాడి చేయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల మీద దాడి చేస్తున్నది. భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయాలని, ప్రశ్నించకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నరు. గతంలో ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడూ లేదు. రాయలసీమ తరహా  ఫ్యాక్షనిస్టు సంస్కృతిని, దాడులు చేసే సంస్కృతిని ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణలో తెచ్చి, లా అండ్ ఆర్డర్ ను కుప్ప కూలుస్తున్నడు. ఈ సంస్కృతిని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో హర్షించరు.  దీనికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు, .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్