తిరుచానూరు పంచాయతీ శాఖ,టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ సమీక్ష

- Advertisement -

తిరుచానూరు పంచాయతీ శాఖ,టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ సమీక్ష

Review by Tiruchanur Panchayat Department, TTD Health Department

తిరుపతి
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పంచాయతీ శాఖ, టిటిడి హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో విజయవంతంగా సేవలను అందిస్తాం అని తిరుచానూరు ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి ఈవోపీఆర్డి మాధురి స్పష్టం చేశారు…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా గల తోళ్ళప్ప గార్డెన్ లో పంచాయతీ శాఖ టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు టిటిడి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డి మాధురి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పంచాయతీ శాఖ, టిటిడి హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో విజయవంతంగా సేవలను అందిస్తాం అని అన్నారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజున 1,50,000 మంది యత్రికులు వస్తారని ఆశిస్తున్నామని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని వీధి కుక్కలను ఆవులను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి యూనిట్ ఆఫీసర్, కులశేఖర్ పద్మావతి టెంపుల్ సానిటరీ ఇన్స్పెక్టర్, టిటిడి సిబ్బంది పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular