- Advertisement -
ఎన్టీఆర్ మార్గ్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వాకథాన్ కార్యక్రమం
Road Safety Awareness Walkathon program on NTR Marg
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
వాకథాన్ లో భారీగా పాల్గొన్న విద్యార్థులు
హైదరాబాద్
శుక్రవారం నాడు ఎన్టీఆర్ మార్గ్ లో రోడ్ సేప్టీ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పై ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ వాకథాన్ లో విద్యార్థులు ,రవాణా శాఖ అధికారులు పాల్గోన్నారు. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా హజరయ్యారు.
ఈ ర్యకాక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ , రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, , కార్పొరేటర్ విజయారెడ్డి , రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ , జేటీసీ లు తదితరులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రహదారి భద్రత మన అందరి బాధ్యత. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మన అందరికీ అవగాహన కలిగించుకున్నాం. రోజూ వారి జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిని ఒక్కరినైన కాపాడితే మన జీవితంలో మనకి తృప్తిని ఇచ్చేది గా భావిస్తాం.. 25 సంవత్సరాలలో రాజకీయంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఇది రవాణా శాఖ ముఖ్యమైన కార్యక్రమం. కేంద్ర మంత్రి గడ్కారీ రోడ్డు భద్రత వారోత్సవాలు నుండి ప్రాధాన్యత ను పెంచి రోడ్డు భద్రత మాసోత్సవాలు చేశారుదాదాపు 15 లక్షల మంది విద్యార్థులను ప్రజలను భాగస్వామ్యం చేసి 33 జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసిన రవాణా శాఖ అధికారులకు అభినందనలు. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంది.రాష్ట్రంలో ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుర్తించి తొలగించి అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చూస్తుంది. రహదారి భద్రత రాబోయే కాలంలో విద్యార్థులు చదువుకోవడానికి పాఠ్యాంశం పెట్టే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. రవాణా శాఖ అధికారులు వినియోగించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
- Advertisement -