- Advertisement -
చెరువులను తలపిస్తున్న రహదారులు
Roads leading to Ponds
విజయవాడ
భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్‌ఆర్ నగర్‌లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండల పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో శనివారం ఓ వ్యక్తి వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు దాటే క్రమంలో అతను కిందపడి బైక్‌తో సహా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
- Advertisement -



