జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ జరగాలి
– జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
Sand should be evenly distributed
– రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
– జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
– రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
– జిల్లాలో ఇసుక పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.
– జిల్లాలో ఉన్న ఒకే ఒక స్టాక్ యార్డు జుంజురాంపల్లి స్టాక్ యార్డు అని, ఇక్కడ దాదాపు 58,160 మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ చేసే అవకాశం ఉండగా, ఇప్పటివరకు 16,226 మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీ చేయగా, స్టాక్ యార్డులో 41,934 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు.