- Advertisement -
సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదు..
Sankranti movies are not important..
బెనిఫిట్ షోలు.. టికెట్ రేట్ల పెంపు అనేది చిన్న అంశం
ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు
హైదరాబాద్ డిసెంబర్ 26
; సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదని, బెనిఫిట్ షోలు.. టికెట్ రేట్ల పెంపు అనేది చిన్న అంశం మాత్రమేనని, అది ఇష్యూ కాదని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు.ఈ భేటీ అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ..”నా ద్వారా సినీ పరిశ్రమ విషయాలు తెలపాలన్నారు. తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో స్పందన వస్తోంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆయన విజన్ తెలిపారు. సినీ పరిశ్రమను ప్రపంచ వ్యాప్తం చేయడమే మా లక్ష్యం. ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్‌గా మార్చేందుకు అడుగులు వేస్తాం. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం. సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందనేది అపోహ మాత్రమే. హాలీవుడ్ వాళ్లు కూడా హైదరాబాద్‌లో షూటింగ్స్ చేసుకునేలా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించారు. ఇండస్ట్రీలో కూడా ఒక పెట్టుకోమని సిఎం సలహా ఇచ్చారు. త్వరలో కమిటి ఏర్పాటు చేసి..మీటింగ్ పెట్టుకుంటాం..15 రోజుల్లో కమిటీ రిపోర్ట్ సిఎంకు అందజేస్తాం” అని దిల్‌రాజు చెప్పారు.
- Advertisement -