Wednesday, February 18, 2026

అభివృద్ధిని చూడండి.. మళ్ళీ ఆశీర్వదించండి.

- Advertisement -

పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి : అక్టోబర్ 31(వాయిస్ టుడే): కూకట్ పల్లి సర్కిల్ అల్లాపూర్ డివిజన్ పరిధిలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఒకప్పుడు అల్లాపూర్ డివిజన్లో సబ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఏ విధంగా ఉండేది నేడు ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని, రోడ్లు, డ్రైనేజ్, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలు అల్లాపూర్ డివిజన్లో అత్యధిక మందికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా నేడు గల్లి, గల్లికి సిసి రోడ్లు, ఇండోర్ స్టేడియంలు, ట్రాఫిక్ సమస్య అరికట్టడనికి ఈ ప్రాంత వాసులకు కైతలపూర్ ఫ్లై ఓవర్ నిర్మించామన్నారు. వర్షం వస్తె అల్లాపూర్ లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడే వారని, నేడు నాళాలు అభివృద్ధి చేసి ఆ సమస్యను అరికట్టామని తెలిపారు. అంతే కాకుండా శివాజీ నగర్ లో రోడ్డు సమస్య ఉందని ఒక మహిళ తెలపగా స్వయంగా తానే రంగంలోకి దిగి ఆ పనులు పూర్తి చేశామని అన్నారు. అంతే కాకుండా అన్ని ప్రాంతాలలో స్మశాన వాటికలు అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారుమని అన్నారు. 18 వ సర్వే నంబర్ లాండ్ సమస్యలు పరిష్కారంచేసి ముస్లిం, హిందూ వారికి పాఠశాలలు నిర్మించ బోతుమన్నారు. అలాగే వివేక నందనగర్ లో కమిటి హాల్ నిర్మించి ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం మాధవరం కృష్ణారావు నీ ఒడించాలి అంటున్నారని, అంటే చివరికి ఎంత దిగజారి ఉన్నారో అర్దం చేసుకోవాలన్నారు. దీన్ని బట్టి అర్దం అవుతుంది వారికి ప్రజా సంక్షేమం అక్కర్లేదు, అధికారం తప్ప అని ఎద్దేవా చేశారు. అన్ని విధాలుగా అల్లాపూర్ డివిజన్ ఆదర్శ డివిజన్ గా తీర్చి దిద్దామని అన్నారు. గతంలో ఇక్కడ ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపించారని, వారికి నా పాదభి వందనాలు అంటూ ఇపుడు జరుగబోయే ఎన్నికల్లో కూడా అభివృద్ధి కి పట్టం కట్టాలని, కారు గుర్తుకు ఓటు వేసి తనని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్