- Advertisement -
కుటుంబ తీసుకొన్న నిర్ణయం వల్ల ఇద్దరికీ చూపు
Show both because of the decision taken by the family
కమాన్ పూర్
. రామగిరి మండలం
సెంటినరీకాలనీలో నివాసం ఉండే మాదారపు కేశవరావు కూతురు మదారపు మమత సంస్కరణ సభ వారి సగృహంలో లైన్స్ క్లబ్ ఆఫ్ సెంటనరీ కాలనీ మరియు సదాశయఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమనికి విచ్చేసిన లయన్స్ ఆఫ్ సెంటినరీకాలనీ డైరెక్టర్స్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, మాజి జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి మరియు సదాశయ ఫౌండేషన్ తరుపున నూక రమేష్, కొండ సమ్మయ్య హాజరై మాట్లాడుతూ కేశవరావు గారు తమ కూతురు తమ నుండి భౌతికంగా దూరమైన చూపు ఇద్దరు అందులకు చూపు ప్రసాదించి ప్రపంచాన్ని చూసేలా చేయడానికి వారు బాధలో ఉండి కూడా గొప్పగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, దీనికి సహకరించిన కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి వారు పంపిన అభినందన పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు కళాధర్ రెడ్డి, సభ్యులు అల్లంకి రామారావు,సత్య రెడ్డి,మేకల మారుతి యాదవ్ మరియు పాశం శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ ,రాజశేఖర్ రెడ్డి , అరెండ ప్రకాష్, సురేందర్ రావు,శ్రీకాంత్ రావు, బుడిగే క్రాంతి తదితరులు పాల్గొన్నారు
- Advertisement -