Sunday, January 25, 2026

శ్రావణమాసం … రాజకీ య పార్టీలకు  ముహుర్తం  కలిసొచ్చేనా ?

- Advertisement -

హైదరాబాద్‌, ఆగస్టు 17:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీ య పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్రావణ మాసం మొదలవుతున్నది.

shravanamasam-will-the-political-parties-get-together
shravanamasam-will-the-political-parties-get-together

శ్రావణంలో శుభముహుర్తం కుదరడంతోనే అభ్యర్థుల ఎంపికకు, ప్రచారానికి ఇక అన్ని పార్టీలు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ నెల 18న శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి విశేషమైన రోజుగా ఎంచుకుంటారు. అభ్యర్థుల ప్రకటన, మ్యానిఫెస్టో విడుదల, ఎన్నికల ప్రచారం వంటివి శ్రావణమాసంలో ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.

ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రావణమాసంలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి శ్రావణమాసం కలిసొచ్చింది  (2018) బీఆర్‌ఎస్‌ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శ్రావణంలోనే ప్రకటించింది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్‌ కొనసాగే అవకాశం ఉంది.

శ్రావణం త ర్వాత వచ్చే భాద్రపదంలో ప్రథమార్ధం వినాయక చవితి సందడితో ముగుస్తుంది. ద్వితీయా ర్ధం పితృపక్షాలను అంత శుభకరంగా భావించరు.

ఎన్నో విశిష్టతలు గల మాసం శ్రావణ మాసం

శ్రావణంలోపే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో

శ్రావణం ముగిసేలోపు మ్యానిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. సెప్టెంబర్‌ 15న సోనియా గాంధీతో చేతుల మీదుగా మ్యానిఫెస్టో విడుదల చేయించాలన్నది టీపీసీసీ యోచన.

ఆ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులకు శ్రావణం లోనే శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఆ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సిద్ధం చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం వల్ల నష్టం జరిగిందని, ఈసారి అలా జరగకుండా దశల వారీగా జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

బీజేపీ రాష్ట్ర కమిటీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌లో ఒక సీటుకు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుంటే కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం అభ్యర్థుల కొరతతో సతమతమవుతున్నాయి. బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండగా, కాంగ్రెస్‌కు ఉత్తర తెలంగాణలో చెప్పుకోదగ్గ అభ్యర్థులు కనిపించడం లేదు. సిట్టింగ్‌ ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపాల్సిందిగా రాష్ట్ర బీజేపీని అమిత్‌ షా ఆదేశించారని సమాచారం. ఇప్పటివరకు 40 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులు ఉన్నారని, మిగతా సెగ్మెంట్ల కోసం అభ్యర్థులను వెతకాల్సిందిగా పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.

బీఆర్‌ఎస్‌ తొలి జాబితా రెడీ?

గత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సెప్టెంబర్‌ 7, 2018 శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే 80 నుంచి 87 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల సమాచారం.

శ్రావణమాసంలో ఏ క్షణంలో అయినా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 21న పంచమితో కూడిన శ్రావణ సోమవారాన్ని విశేషమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో అదేరోజు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం లేకపోలేదు.

అంతేకాదు, శ్రావణంలో శుక్ల దశమి, పౌర్ణమి, కృష్ణపక్షంలో విదియ, తదియ కూడా అభ్యర్థుల ప్రకటనకు, ఇతర రాజకీయ ఎత్తుగడలకు అనువైన రోజులుగా పంచాంగకర్తలు విశ్లేషిస్తున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్