- Advertisement -
విశాఖ లో ఏకకాలంలో హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..
Simultaneous police checks on hotels, lodges and men's hostels in Visakha.
విశాఖపట్నం
విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జీలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 80 హాస్టళ్లు, లాడ్జిలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు జరిపారు. 47 హోటల్స్, లాడ్జీలలో అగ్నిమాపక ఎన్వోసీ (Noc)లు లేవని గుర్తించారు. 22 హోటల్స్, లాడ్జీలలో జీఎస్టీ పత్రాలు లేవని, 8 హోటల్స్, లాడ్జీలలో ట్రేడ్ లైసెన్సులు లేనట్లు పోలీసులు గుర్తించారు. హోటల్స్, లాడ్జిలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సర్టిఫికెట్స్ లేవని… 5 హోటల్స్లో సందర్శికులకు సంబంధించి రికార్డులు మెంటైన్ చేయడం లేదు. 5 హోటళ్లలో సీసీటీవీలను పర్యవేక్షించడం లేదు. 36 హోటల్స్, లాడ్జీలలో లగేజ్ స్కానర్, అండర్ వెహికల్ చెక్ మిర్రర్ వంటి యాక్సెస్ లేదని గుర్తించారు. హోటల్స్, లాడ్జీలలో నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -