ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో టూరిజం ని డెవలప్మెంట్ చేయడంతో పాటు హోటల్ అండ్ రెస్టారెంట్ చిన్న పరిశ్రమ రంగాలను అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , భారత ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంపై రాష్ట్ర హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వారి ఇద్దరికీ రుణపడి ఉంటామని ఏపీ తెలంగాణ రాష్ట్రాల హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి వెంకటరెడ్డి తిరుపతి అధ్యకులు వీరాంజనేయులు (చిల్లీస్ అంజి) తెలియజేశారు. రాష్ట్రంలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ యజమానులు ప్రతినిధులు మూడు ప్రధాన సమస్యలతో బాధపడుతున్నారని ఒకటి రాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచి ఉంచుకోవచ్చని జీవో ఉన్నా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అలాగే హోటల్ అండ్ రెస్టారెంట్స్ ను చిన్న పరిశ్రమలుగా గుర్తించాలని ఇప్పటికే కర్ణాటక మహారాష్ట్రల్లో వాటిని చిన్న పరిశ్రమలుగా గుర్తించారని తెలిపారు. మంత్రి ఆర్కే రోజా ప్రోత్సాహం సహాయ సహకారాలతో సీఎం ,పి యం రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో విశాఖపట్నం విజయవాడ తిరుపతి మూడు ప్రాంతాల్లో హోటల్ అండ్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ టూరిజం విభాగంతో అనుసంధానమై శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వాలని అసోసియేషన్ తరపున కోరామన్నారు.ఈ మూడు ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,పీఎం నరేంద్ర మోడీ మంత్రులు ఆర్కే రోజా, అమర్నాధ్ టూరిజం శాఖ ఉన్నతాధికారులు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు.చిన్న స్థాయి పరిశ్రమలను దేశంలో అభివృద్ధి చేసేందుకు నరేంద్ర మోడీ రూ. 14 వేల కోట్లు నిధులు ఇస్తామని చెప్పడం అభినందనీయమన్నారు.దీనిలో భాగంగా ఈ నెల 22వ తేదీన బెంగళూరులో దక్షిణ భారత ఉత్సవం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఆరు రాష్ట్రాల టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హాజరై హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ సమస్యల పరిష్కారానికి ఓ మార్గ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



