12.2 C
New York
Wednesday, April 24, 2024

యదేచికంగా ఇసుక అక్రమ రవాణా

- Advertisement -

యదేచికంగా ఇసుక అక్రమ రవాణా

శాఖల మధ్య సమన్వయ లోపం ప్రభుత్వం ఆదాయానికి లక్షలలో గండి

పట్టించుకోని మైనింగ్ అధికారులు

రాజకీయ నాయకులు వీడీసీలకు కాసులు కురిపిస్తున్న వ్యాపారం

పల్లెల్లో బహిరంగంగా వేలం పాట సొమ్ము చేసుకుంటున్న విడిసిలు….

నిర్మల్ జిల్లా వాయిస్ టుడే ప్రతినిధి జనవరి 25

నిర్మల్ జిల్లాలో యదేచంగా ఇసుక దందా కొనసాగుతున్నది విపరీతంగా ఇసుకకు డిమాండ్ ఉండడంతో నిర్మల్ పట్టణంతో పాటు భైంసా ఖానాపూర్ ప్రాంతాల్లో ఇసుక డంప్లే దర్శనమిస్తున్నాయి ప్రధానంగా రాజకీయ నాయకులు గ్రామ అభివృద్ధి కమిటీలుకు ఆదాయ వనరులుగా మారాయి. తమ గ్రామ పరిధిలోని వాగులో నుండి వేలం నిర్వహించి అనధికారికంగా ఇసుకను తవ్విస్తున్నారు.భూగర్భ గనుల శాఖ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో దందా నిరంతరాయంగా కొనసాగుతుందని విమర్శలు ఉన్నాయి.జిల్లాలోని ఇసుకకు కేంద్ర బిందువుగా మారింది ఖానాపూర్ మండలాలలో పరిధిలో ప్రవహించి పలుగేరి వాగు దందాకు అడ్డగా మారింది భైంసా సమీపంలో గల సుద్ద వాగు దాని ఉపవాగు నుంచి కూడా తరలిస్తున్నారు. ముఖ్యంగా పుసుపూర్ సాద్గా గం. హద్గం. బిజ్జూర్ ఎగ్గమ్. గ్రామాలలో నుండి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అలాగే నిర్మల్ జిల్లా చిట్యాల స్వర్ణ. కడ్తాల్ కాల్వ వాగు పరివాహక ప్రాంతాలలో బోరిగం ఆలూరు కౌట్ల వేంగపేట్. సోన్ కుచాన్పల్లి వడ్డేల్ గ్రామాలను కేంద్రంగా చేసుకొని పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారు చాలా చోట్ల ఇసుక డ్రంపులు కనిపిస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేయడం అనుమానాలకు తావిస్తున్నది ఫలితంగా ప్రభుత్వానికి లక్షల రూపాయల రాయల్టీ కోల్పోతున్నది కాగా ఇసుక తరలింపు భూగర్భ జలాలపై కూడా పడుతున్నది

అంత విడిసి కనుసన్నంలోనే…..

గ్రామాల సరిహద్దు గుండా ప్రవహిస్తున్న వాగులపై అక్కడి వీడీసీలు గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఇసుకను తరలించడానికి అనాధికారికంగా వేలంపాట నిర్వహించి. గ్రామాల్లో రసీదుని తయారుచేసి మరి ఇసుకను విక్రయిస్తున్నారు.సర్పంచులు ప్రజాప్రతినిధులు విడిసి మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితులు కొనసాగుతున్న కారణంగా ఇసుక దందా దర్జాగా సాగుతున్నది ఇసుకకే కాకుండా బెల్ట్ షాపులు కూల్ డ్రింకులు షాపులు చికెన్ దుకాణాలకు కూడా వేలం పాట నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ నిధులను గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్న ఆశించినంత అభివృద్ధి కనిపించడం లేదని ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

రాజకీయ నేతల హస్తం

ఇసుక దంద వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి పలుకుబడితో అధికారులను మంచిగా చేసుకుని దంద కొనసాగిస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అధికారులను పక్కదోవా పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అధికారులు కూడా కొన్నిచోట్ల ఇసుక డంపులను స్వాధీనం చేసుకుంటున్నారు ఆ తర్వాత సీజ్ చేసిన ఇసుకకు రహస్యంగా వేలం నిర్వహించడంతో తమ. అనుకూలమైన వ్యక్తులకు తక్కువ ధరకే దక్కించుకుంటున్నారు ఇలా అంతా ఒక కనికట్టును తలపించే విధంగా కొనసాగుతున్నది అధికారులు స్పందించి అక్రమంగా కొనసాగుతున్న ఇసుక వ్యాపారాన్ని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు సాక్షాదారులతో సహా పత్రికలు కథనాలు రచించిన విషయం పాఠ్యకులకు తెలిసింది ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న తీరును మైనింగ్ అధికారులు గమనిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పవచ్చు ఇప్పటికైనా స్పందించి అధికారులు సరైన మార్గంలో ఇసుక అడ్డు కట్ట వేయాలని కోరుతున్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!