- Advertisement -
ఖమ్మం: ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతుందని ఇసుక నుండి మట్టి దాకా దోపిడి దొంగల పాలయ్యిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం 50 డివిజన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుతం సామాన్యుడు ఒక ప్లాటు కొనుక్కుంటే దాన్ని కూడా ఎపుడు ఎవరొచ్చి కబ్జా చేస్తారోనని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని,నగరంలో అన్ని మాఫ్ఫైయాలతో పాటు కొత్తగా ట్రాన్స్ పార్ట్ మాఫియా కూడా వెలుగులోకి వచ్చిందని ఈ దుర్మార్గపు పాలన నుండి ఖమ్మం నగర ప్రజలు బయట పడాలంటే నవంబర్ ముప్పైన జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని తుమ్మల కోరారు.
- Advertisement -