- Advertisement -
రైలు లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్పెషల్ డ్రైవ్
Special drive against human trafficking in railఆరుగురు మైనర్లను తరలిస్తున్నట్లు గుర్తించిన రైల్వే పోలీసులు
మైనర్లను గుంటూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలింపు
పిడుగురాళ్ల ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ కె ఏడుకొండలు వెల్లడి
గుంటూరు
హౌరా నుండి సికిందర్బాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆరుమంది మంది మైనర్లు హౌరా నుండి నల్గొండ, సికింద్రాబాద్లకు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారు కూలీ పనులకు వెళుతున్నట్లు అనుమానించారు. మైనర్లు కావడంతో గుంటూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించామని పిడుగురాళ్ల ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ కె ఏడుకొండలు వెల్లడించారు.
- Advertisement -




