- Advertisement -
సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండరామస్వామి కటాక్షం
Sri Kodandaramaswamy's commentary on Suryaprabhavahanam
తిరుపతి,
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం సూర్యప్రభవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంలో మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
అదేవిధంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తలు పాల్గొన్నారు.
- Advertisement -