Sunday, May 17, 2026

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

Sri Komuravelli Mallikarjuna Swamy Brahmotsavas

మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
సిద్దిపేట
మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ పరిసర ప్రాంతాలను దర్శన ప్రాంతాలను, వీఐపీ పార్కింగ్ జనరల్ పార్కింగ్ దర్శన ప్రదేశాలను, పరిశీలించారు. పోలీస్ అధికారులకు సిబ్బందికి పలు  సూచనలు చేశారు. బందోబస్తుకు వచ్చే పోలీస్ అధికారులకు సిబ్బందికి  పటిష్టమైన బందోబస్తు గురించి  దిశా నిర్దేశం చేశారు, ప్రతి ఒక్కరూ సరియైన సమయానికి వచ్చి విధులు నిర్వహించాలని  దర్శనానికి వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. బందోబస్తు విషయంలో కానీ ఏ విషయంలోనైనా ఎలాంటి సమస్యలు ఉన్నా చేర్యాల సిఐ, హుస్నాబాద్ ఏసిపి, కొమురవెల్లి ఎస్ఐ లకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. ఎగ్జిట్ వైపు నుండి ఎవరిని కూడా దర్శనానికి పంపవద్దని సూచించారు. క్యూలైన్  విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు నిర్వహించాలని సూచించారు. బందోబస్తు  నిర్వహించే అధికారులు సిబ్బంది రిలీవర్ వచ్చేంతవరకు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళకూడదని సూచించారు.
ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది రోడ్లపై వాహనాలు నిలపకుండా ఎప్పటికప్పుడు   తనిఖీలు చేస్తూపార్కింగ్ ప్రదేశాలకు పంపించాలని సూచించారు. దొంగతనాలు పిక్ ప్యాక్టింగ్ జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ లో 24X7 నిఘా ఉంచాలని సూచించారు. బందోబస్తు వచ్చే పోలీస్ అధికారులకు సిబ్బందికి  అకామిడేషన్ మరియు భోజన సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందన్నారు.
మొదటివారం పట్నం వారం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇట్టి బందోబస్తును 3 సెక్టార్లుగా విభజించడం జరిగింది:
టెంపుల్ ఆవరణ చుట్టుపక్కల దర్శన ప్రదేశాలు ఒక సెక్టరుగా తోటబావి పట్నం వేసే ప్రదేశం  రెండవ సెక్టార్
పార్కింగ్ ప్రదేశాలు రెండవ సెక్టార్గా విభజించడం జరిగింది. ప్రతి ప్రదేశాన్ని పరిశీలించి భారీ కేటింగ్ తదితర అంశాల గురించి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  బందోబస్తు నిర్వహించాలని అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు.
వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడం జరిగింది కంట్రాల్ రూంను ఏర్పాటు చేస్తున్నాం  ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కంట్రోల్ రూంలో అందుబాటులో వుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు మరియు విఐపి దర్శనం, శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం మూడు విభా మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. కళ్యాణ వేదిక వద్ద  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, పార్కింగ్ ప్రదేశాలలో మరియు టెంపుల్ ఆవరణలో 80 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘాఏర్పాటు చేయడం  జరుగుతుంది. అడిషనల్ డీసీపీలు 2, ఎసిపిలు 4, సిఐలు14, ఎస్ఐలు 28,  ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు,మహిళా కానిస్టేబుళ్లు,మహిళ హోంగార్డులు, బీడీ టీమ్స్, యాక్సెస్ కంట్రోల్, రోప్ పార్టీ మొత్తం అధికారులు సిబ్బంది 510,  మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
పార్కింగ్ ప్రదేశాలు:
తోటబావి సమీపంలో ఎడమవైపు చుట్టు కాంపౌండ్ వాళ్ళు ఉన్న ప్రదేశంలో విఐపి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
చేర్యాల, కిష్టంపేట మరియు సిద్దిపేట, కొమురవెల్లి కమాన్ నుండి వచ్చే వాహనదారులు కొమురవెల్లి బస్టాండ్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
హైదరాబాద్, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, చిన్న కిష్టాపూర్  కొండపోచమ్మ టెంపుల్ నుండి వచ్చే వాహనదారులకు పెట్రోల్ పంపు వెనుక భాగమున, పద్మశాలి నిత్య కళ్యాణ సత్రం  ఎడమ వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
పార్కింగ్ ప్రదేశాల్లో తప్ప ఇతర ప్రాంతాలలో ఎవరు వాహనాలు పార్కు చేసుకోవద్దు వాహనాలు టెంపుల్ ఆవరణలోనికి అనుమతి లేదు.
శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణానికి వచ్చే భక్తులు  పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి వాహనాలు పార్కింగ్ ప్రదేశంలో పార్కు చేసి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకుని వెళ్లాలని సూచించారు.
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి  టెంపుల్ ఆవరణ  పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, చేర్యాల సిఐ శీను, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, కొమురవెల్లి ఎస్ఐ రాజు, ఇన్స్పెక్టర్లు,సిఐలు,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్