శ్రీ మణి మాణిక్వేశ్వరి చండీ కాలయం అమ్మవారి ప్రతిష్ట
హైదరాబాద్ : ఫిబ్రవరి 22(వాయిస్ టుడే)
పాతబస్తీ గోలిపురంలోని శ్రీ మణి మాణిక్వేశ్వరి చండీ కాలయం అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణంతో కార్యక్రమము ప్రారంభమైనది. అమ్మవారిని పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించారు, మంగళ వాయిద్యాలు భక్తులను ఆకర్షించింది. గజస్తంభ స్థాపన యంత్ర స్థాపన మూర్తి స్థాపన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము కన్నుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు వేద పండితులు ఆశీర్వచనం వివిధ ప్రసాదాలు ఇచ్చారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం పల్లకి సేవ మురారి మహల్ నుండి ప్రారంభమై గోలిపుర, చత్రీనాక, లాల్ దర్వాజా, సుధా టాకిస్, పని మాణిక్యేశ్వరి చండికాలయము వరకు జరిగింది.